కేశవ ఫస్ట్ లుక్: నిఖిల్ భయంకరంగా మారిపోయాడు | Kesava movie first look released.

Nikhil siddharth kesava first look released

Nikhil Siddharth, Nikhil Siddharth Kesava, Kesava movie first look, Nikhil Siddharth Kesava, Nikhil Siddharth New Movie, Sudheer Varma Kesava, Kesava Director, Sudheer Varma

Nikhil Siddharth's Kesava Movie first look released.

నిఖిల్ కేశవ ఫస్ట్ లుక్ రిలీజ్

Posted: 12/24/2016 04:02 PM IST
Nikhil siddharth kesava first look released

టాప్ హీరోలంతా రోటీన్ మాస్ మసాలా సినిమాలతో ఊదరగొట్టేస్తుంటే... యంగ్ హీరోలు మాత్రం చాలా డిఫరెంట్ సబ్జెక్టులను ఎంచుకుని సక్సెస్ లు కొట్టేస్తున్నారు. ఆ లిస్ట్ లో యువ హీరో నిఖిల్ కూడా ఉన్నాడు. మధ్యలో శంకరాభరణంతో గాడి తప్పినప్పటికీ, రీసెంట్ గా ఎక్కడిపోతావు చిన్నవాడా తో 40 కోట్ల మార్క్ ను టచ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక ఇప్పుడు మరో విభిన్నమైన కథతో వస్తున్నాడు.

హిట్ కాంబో నిఖిల్-సుధీర్ వర్మ గుర్తున్నారు కదా! టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లలో ఒకటి. స్వామి రారా అంటూ చిన్న మూవీతో పెద్ద సెన్సేషన్ సృష్టించిన ఈ కాంబినేషన్.. ఇప్పుడు కేశవ అంటూ మరో ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రెండు రోజుల క్రితం ప్రీలుక్ తో ఆకట్టుకున్న కేశవ.. ఇప్పుడు ఫస్ట్ లుక్ తో ఆడియన్స్ ను అలరిస్తున్నాడు. కేశవ ఫస్ట్ లుక్ పోస్టర్ లో నిఖిల్ ఒక్కడే ఉన్నాడు. అయితే.. ఏ రేంజ్ రఫ్ గా ఉన్నాడంటే.. ఇప్పటి మాస్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో ఉన్నాడు నిఖిల్.

రఫ్ గా పెంచిన గెడ్డం.. కోర మీసంతో.. పగతో రగిలే యువకుడిగా కనిపిస్తున్నాడు. కసి. పోస్టర్ మాత్రం రక్తపాతం నింపేసి.. రక్త చరిత్రను గుర్తు చేశారు. నిఖిల్ కి పాయింట్ బ్లాంక్ లో డిజైన్ చేసిన గన్.. ఫ్లోర్ పై రక్తం మరకలు.. పక్కనే తుపాకీ.. ఇవన్నీ కేశవ ప్రత్యేకతలు. ఇంతకు రిలీజ్ అయిన ఫ్రీ లుక్ పోస్టర్ లో నీళ్లలో చుట్టూ చేరి ఒక మనిషి నరకాలని చూడటం, ఆ నీటి మడుగు అంతా రక్తంతో నిండి ఉండటం, పైగా దానికి 'పగ అనే వంటకాన్ని చల్లగా ఉన్నప్పుడు వడ్డిస్తే కిక్కే వేరు' అనే ట్యాగ్ లైన్... చూస్తుంటే సుదీర్ ఈసారి ఏదైనా ఫాక్ష్యన్ కథను ట్రై చేయబోతున్నాడన్న అనుమానాలు కలుగుతున్నాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sudheer Varma  Nikhil Siddharth  Kesava First look  

Other Articles

Today on Telugu Wishesh