బన్నీ ‘ఏంజెల్’ కి భలే పేరు.. ఫస్ట్ లుక్ వదిలాడు | Allu Arjun daughter Arha.

Allu arjun names his daughter

Allu Arjun, Allu Arjun Daughter, Allu Arjun Angel Name, Allu Arjun Christmas, Allu Arjun Sneha Reddy, Allu Arjun new Baby, Allu Arjun daughter first look, Allu Arjun Arha, Allu Arjun Sneha Reddy's Daughter, Sneha Reddy's Daughter and son, Sneha Reddy's Son and Daughter, Allu Arjun Kids, Allu Arjun A sentiment, Allu Arjun daughter name meaning

Allu Arjun names his daughter Allu Arha, shares her first pic.Allu Arha is Actor Allu Arjun And Sneha Reddy's Daughter's Name Arha.

బన్నీ కూతురికి భలే పేరు

Posted: 12/26/2016 08:21 AM IST
Allu arjun names his daughter

ప్రస్తుతం సెలబ్రిటీలు పిల్లల పేర్ల విషయంలో చాలా ఇంట్రెస్టింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. పుట్టక ముందే పేర్లతో కొందరు రెడీగా ఉంటే.. మరి కొందరు జన్మించాక అన్ని చూసుకుని పేర్లు పెట్టేస్తున్నారు. ఈ మధ్యే సైఫ్-కరీనాల కొడుక్కి తైమూరు అని పేరు పెడితే, ఓ నియంత పేరు పెట్టారంటూ అది కాస్త పెద్ద వివాదానికి దారి తీసింది. ఏది ఏమైనా తమ సెంటిమెంట్లను మాత్రం సెలబ్స్ అస్సలు వీడటం లేదు.

తాజాగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-స్నేహ దంపతులకు అమ్మాయి పుట్టిన విషయం తెలిసిందే. ఇక కూతురి కోసం భలే పేరు ఎంచుకున్నాడు బన్నీ. ఏ సెంటిమెంట్ కలిసొచ్చేలాగానే కూతురికి పేరు పెట్టేశాడు. Ar తీసుకుని.. స్నేహా పేరు చివర్లోని ha తీసుకుని.. అర్హా అంటూ తన కూతురుకు నామధేయం చేస్తున్నట్లు ప్రకటించేశాడు బన్నీ. కొత్తగా మా ఇంట్లోకి వచ్చిన ఏంజెల్ కి పేరు పెట్టేశాం. అర్హా అనే పేరుకు హిందూ సాంప్రదాయంలో పరమశివుడనే అర్దం వస్తుందని.. అలాగే ఇస్లామిక్ సాంప్రదాయంలో కామ్ అండ్ సెరీన్ అంటూ మీనింగ్ వస్తుందని కూడా చెప్పాడు.

కొడుకు పేరు అల్లు అయాన్ అన్న విషయం తెలిసిందే. మొత్తానికి కూతురు పేరు కూడా ఇనీషియల్స్ ఎ.ఎ నే వస్తాయన్నమాట. తన బ్రాండ్ పేరు కంటిన్యూ అయ్యేలా పిల్లలకు కూడా అవే అక్షరాలతో నామధేయం చేసిన బన్నీ, క్రిస్మస్ సర్ ప్రైజ్ అదిరిపోయిందంటూ అభిమానులే కాదు.. నెటిజన్లు కూడా పొగడ్తలు కురిపిస్తున్నారు. #AlluArha

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Sneha Reddy  Daughter  Allu Arha  

Other Articles