రఘువరన్ సీక్వెల్ లో రజనీ కూడానా? | Rajinikanth plays crucial role in VIP-2.

Dhanush vip 2 shooting started

Rajinikanth VIP-2, VIP-2, VIP-2 shooting starts, VIP-2 Rajinikanth, Dhanush Direction, VIP-2 Director, VIP-2 telugu movie, Dhanush’s VIP 2 starts, Rajini’s Blessings VIP-2, Rajini clapped Dhanush

Dhanush VIP sequel started Rajinikanth Clapped Muhurtham shot.

వీఐపీ-2 మొదలైపోయింది

Posted: 12/15/2016 03:01 PM IST
Dhanush vip 2 shooting started

కోడి(తెలుగులో ధర్మయోగి)లాంటి పొలిటికల్ థ్రిల్లర్ తో ధనుష్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేశాడు. ఇదే ఊపులో అల్రెడీ వడ చెన్నై సినిమా షూటింగ్ లో పాల్గొంటూ, మరోవైపు కొత్త చిత్రాలపై కూడా దృష్టిసారించాడు. ఇప్పటికే నిర్మాతగా మారి రజనీతో కబాలి దర్శకుడు పా రంజిత్ తో ఓ సినిమా తీస్తానని అనౌన్స్ చేసిన ధనుష్ ఇప్పుడు ఏకంగా దర్శకుడు మారిపోయాడు.

తమిళ్ తో ఆరేళ్ల తర్వాత తనకు హిట్ ఇవ్వటంతోపాటు తెలుగులోనూ గుర్తింపు తెచ్చింది వీఐపీ(రఘువరన్ బీటెక్). ఇప్పుడు ఆ చిత్ర సీక్వెల్ ను ప్రారంభించేశాడు. రీసెంట్ గా జరిగిన ఓపెనింగ్ కార్యక్రమానికి సూపర్ స్టార్ హాజరై క్లాప్ కొట్టి ఆరంభించి చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. వీఐపీ-2 గా ఇది తెలుగు, తమిళ్ లో తెరకెక్కనుండటం విశేషం. కాగా, ఈ చిత్రానికి కలైపులి థానుతో కలిసి రజనీ మరో కూతురు సౌందర్య రజనీకాంత్ నిర్మాతగా వ్యవహరిస్తోంది.

తొలి పార్ట్ లో నటించిన నటీనటులే ఇందులో కనిపించనున్నారు. హీరోయిన్ గా అమలాపాల్, పేరెంట్స్ క్యారెక్టర్ లో సముద్రఖని, శరణ్య, వివేక్ ఇలా అన్ని పాత్రలు యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్నాయి. క్లాప్ షాట్ వెనకాల రజనీ రోబో-2, మిగతా చిత్రాల పోస్టర్లను చూస్తుంటే చిత్రం లో ధనుష్ ఓ దర్శకుడి పాత్రలోనే కనిపించబోతున్నాడని అర్థమౌతోంది. ధనుష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సీన్ రో్ల్డన్ సంగీతం, అనిరుధ్ రవిచంద్రన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించనున్నాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dhanush  VIP-2 shooting starts  rajinikanth clap  

Other Articles