రణ్ బీర్ మోసగాడు.. కారణం చెప్పిన కత్రినా | Katrina explains why she break with Ranbir.

Katrina says ranbir kapoor a cheater

Katrina Kaif, Ranbir Kapoor, Katrina about Ranbir, Katrina open up why she break up with Ranbir, Reason for katrina break up, Ranbir parents Katrina Kaif, Ranbir Kapoor Katrina Kaif, Ranbir katrina

Finally Katrina Kaif open up why she break up with Ranbir kapoor.

రణ్ బీర్ గురించి అసలు మాట్లాడలేదన్నారు!

Posted: 12/15/2016 04:24 PM IST
Katrina says ranbir kapoor a cheater

బాలీవుడ్ లో ఒకప్పుడు యంగ్ హీరో రణ్ బీర్ కపూర్, నటి కత్రినా కైఫ్ ల ప్రేమాయణం ఏ రేంజ్ లో కొనసాగిందో అందరికీ తెలిసిందే. విదేశీ బీచుల్లో కూడా అప్పట్లో వీరే కనబడ్డారు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ, ఇద్దరూ విడిపోయారు. వారిద్దరూ కలసి కనపడింది కూడా లేదు. చివరకు వీరు కలిసి నటించాల్సిన జస్సా జగ్గూస్ కూడా ఆగిపోయింది. ఆపై నిర్మాతలు ఏదోలా చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేయించారనుకోండి. అయితే, రణబీర్ తో తాను ఎందుకు విడిపోయిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది క్యాట్.

అబద్ధాలు ఆడడంలో రణబీర్ ను మించిన వాడు లేడని ఈ సందర్భంగా కత్రిన మండిపడింది. కుటుంబానికే అతను ఎక్కువ విలువ ఇస్తాడని... వారి తర్వాతే మరెవరైనా అని... ఇలాంటి వాడిని ఏ అమ్మాయి మాత్రం ఇష్టపడుతుందని ప్రశ్నించింది. రణబీర్ ను మరోసారి నమ్మడం అంటూ ఉండదని... ఇకపై తాము కలవమని చెప్పింది. అతడిని వేరే ఏ అమ్మాయి కూడా ఇష్టపడదని... ప్రేమాదోమా అంటూ ఏ అమ్మాయి వెంట పడకుండా, ఇంట్లోవారు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అతనికి మంచిదని చెప్పింది.

నిజానికి ఈ మధ్య కాఫీ విత్ కరణ్ షోకి హాజరైన కత్రినా తన లైఫ్ గురించి మొత్తం చెప్పిందే గానీ ఎక్కడా రణ్ బీర్ పేరు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది. కారణం ఏదైనప్పటికీ రణ్ బీర్ ను విడిపోయాక ఆదిత్య రాయ్ కపూర్ తో ప్రేమాయణం కొనసాగిస్తుందన్న పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అందుకే రణ్ బీర్ కొత్త ఇంటి పంక్షన్ కి ఆదిత్య ఎగ్గొట్టాడన్న వార్త ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా బ్రేకప్ కి కారణం అతని తల్లిదండ్రులేనన్న విషయం మరోసారి కత్రినా మాటలతో రుజువైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Katrina Kaif Cofee with karan  Angry with Ranbir name  Break up reason  

Other Articles

Today on Telugu Wishesh