క్రైం సీరియల్ నటుడు కాల్చుకుని చనిపోయాడు | actor Kamlesh Pandey commits suicide

Crime patrol actor suicide

Crime Patrol actor, Crime Patrol actor suicide, Kamlesh Pandey commits suicide, Kamlesh Pandey death, Crime Patrol Kamlesh, Crime Petrol fame actor, Crime Petrol death

Crime Patrol actor Kamlesh Pandey commits suicide by shooting himself.

క్రైం సీరియల్ నటుడు సూసైడ్ చేసుకున్నాడు

Posted: 12/14/2016 02:50 PM IST
Crime patrol actor suicide

సినీ సెలబ్రిటీల జీవితాలు ఎప్పుడు ఎలా ముగుస్తున్నాయో అర్థం కానీ పరిస్థితి కనిపిస్తోంది. నిత్యం టీవీల్లో కనిపిస్తూ మనల్ని అలరించే నటీనటులు అర్థాంతరంగా తనువు చాలించటం తరచూ చూస్తున్నాం. బాలికా వధు ఫేం ప్రత్యూష బెనర్జీ, తెలుగులో ఓంకార్ డాన్స్ ప్రోగ్రాం ద్వారా పాపులర్ అయిన భరత్ ఇలా తమ తమ వ్యక్తిగత కారణాలతో సూసైడ్ లు చేసుకున్నారు. ఇక ఇప్పుడు మరో నటుడు కూడా ఇలాగే చనిపోయాడు.

సోనీ టీవీలో ప్రసారమయ్యే 'క్రైమ్ పెట్రోల్'లో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించిన కమలేశ్ పాండే ఆత్యహత్య చేసుకున్నాడు. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఉన్న తన ఇంట్లో రివాల్వర్ తో కాల్చుకుని ఆయన ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన జరిగినప్పుడు అతని భార్య సోదరి అంజనీ కూడా అక్కడే ఉన్నారు. కొన్ని రోజుల క్రితం అంజనీ కుమార్తె వివాహం జరిగింది. అయితే, ఈ వివాహానికి కమలేశ్ ను ఆహ్వానించలేదట.

దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన కమలేశ్... మద్యం సేవించి, ఇంట్లో పెద్ద గొడవ చేశాడట. అనంతరం తన రివాల్వర్ తీసి, మొదట్లో గాలిలోకి కాల్పులు జరిపాడు. ఆ తర్వాత తన ఛాతీకి గురి పెట్టుకుని, కాల్చుకున్నాడు. అంబులెన్స్ వచ్చే లోపలే అతను చనిపోయినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనను ఆత్మహత్యగానే పరిగణిస్తున్నామని... పోస్టుమార్టం రిపోర్ట్ లో స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Crime Petrol Actor  Kamlesh Pandey Suicide  

Other Articles