బాహుబలి-2 రానా ఫస్ట్ లుక్ రిలీజ్ | Rana King Bhallala Deva out from conclusion.

Baahubali 2 rana poster revealed

Bhallala Deva, Rana as Bhallala Deva, Bhallala Deva look in Baahubali 2, Baahubali 2, Baahubali the conclusion, Rana in Baahubali 2, Rana Birthday, Rana Birthday Baahubali 2 look, Baahubali 2 Rana, Bhallaladeva Baahubali 2, Baahubali 2 new poster

Baahubali The Conclusion Rana Bhallaladeva poster released on his birthday.

బాహుబలి-2 పోస్టర్ : శివుడిపైగా కోపంతో భళ్లాలుడు

Posted: 12/14/2016 01:35 PM IST
Baahubali 2 rana poster revealed

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి బ్యాక్ టూ బ్యాక్ ట్రీట్లు అందాయి. బాబాయ్ నిన్న బర్త్ డే జరుపుకుంటే.. అబ్బాయి ఇవాళ చేసుకుంటున్నాడు. గురు గా వెంకీ స్టెప్పులతో టీజర్ అందించి అదరగొడితే, ఆర్మీ ఆఫీసర్ గా రానా ఘాజీ పోస్టర్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఈ రోజు పుట్టినరోజు అసలు గిఫ్ట్ అందుకున్నాడు కండలవీరుడు రానా. అదే బాహుబలి-2 ఫస్ట్ లుక్.

బాహుబలి ది కంక్లూజన్ లో రానాకి సంబంధించిన పోస్టర్ కాసేపటి క్రితం విడుదల చేసింది చిత్ర యూనిట్. పరాక్రమంతుడైన భళ్లాలదేవుడు రూపంలో రానా దర్శనమిచ్చాడు. కండలు తిరిగిన దేహంతో, చేతిలో తన పాత గదను పట్టుకుని బహుశా తన కుమారుడు భద్ర తల నరికిన శివుడితో ఢీ కొట్టేందుకు నడిచివస్తున్నట్లు ఉంది. వెనకాల యుద్ధంకి సంబంధించిన బ్యాగ్రౌండ్ బహుశా క్లైమాక్స్ పార్ట్ కి సంబంధించిన పోరాటంకి సంబంధించినట్లు ఉన్నాయి.

ఇప్పటికే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా శివుడి పోస్టర్ వదిలిన బాహుబలి టీం, ఇప్పుడు భల్లాలదేవుడి లుక్ ను వదిలింది. తెలుగు, తమిళ్, మళయాళం(పల్వల్తేవన్) భాషల్లో కూడా పోస్టర్లు వదలటం విశేషం. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ నెలాఖరుకి గుమ్మడికాయ కొట్టనుంది. ఏప్రిల్ 28, 2017న బాహుబలి- ది కంక్లూజన్ విడుదల కానుంది. బాహుబలితో తన క్రేజ్ ను అమాంతం పెంచేసుకున్న రానా మున్ముందు మరిన్ని మంచి చిత్రాలు అందించాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే రానా.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  Bhallala deva look  Rana poster  

Other Articles