రెహమాన్ కి ఆయన ఆస్కార్ ఇప్పిస్తాడా? | Will Pele brings Oscar to Rahman.

Rahman in oscar race again

AR Rahman Oscar, Rahman Oscar Race, Pele Movie Ginga, Ginga Song, Ginga AR Rahman, Ginga in Oscar Race, 89 Oscar Awards AR rahman, 89th Academy Awards AR Rahman, Pele Rahman Oscar

AR Rahman in Oscar race again, Pele brings him recognition.

ఆస్కార్ పోటీలో రెహమాన్ పాట

Posted: 12/14/2016 04:41 PM IST
Rahman in oscar race again

దేశం గర్వించదగ్గ సంగీత దర్శకుల టాప్ లిస్ట్ లో ఏఆర్ రెహ్మన్ కూడా ఖచ్ఛితంగా ఉంటాడు. భారత్ తరపున ఆస్కార్ గెలుచున్న(రెండు) తొలి సంగీత దర్శకుడిగా రికార్డు క్రియేట్ చేశాడు. స్లమ్ డాగ్ మిలీనియర్ చిత్రానికి గానూ 2009లో రెహ్మన్ ఈ ఘనత సాధించాడు.

ఇక ఇప్పుడు మరోసారి రెహ్మన్ కి ఆ అవకాశం లభించింది. ఈ యేడాది బెస్ట్ మ్యూజిక్ విభాగానికి గానూ రెహ్మన్ స్వరాలు సమకూర్చిన ‘గింగా’ ఆస్కార్ ను నామినేట్ అయ్యి తుది జాబితాలో చోటు సంపాదించుకుంది. మొత్తం 145 పాటలతో కూడిన ఈ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో గిగా కూడా ఉండటం విశేషం. ప్రముఖ పుట్ బాల్ క్రీడాకారుడు పీలే జీవిత గాథపై తీసిని ’’పీలె: బర్త్ ఆఫ్ లెజెండ్’’ కోసం ఈ స్వరాన్ని సమకూర్చాడు.

జనవరి 24న 89వ అకాడమీ అవార్డుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఫిబ్రవరి 26న హాలీవుడ్ హైలాండ్ సెంటర్ లో ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది.

రోజా సినిమాతో 1992 లో కెరీర్ ప్రారంభించిన రెహ్మన్ ఆపై రంగీలా, తాళ్, దిల్ సే, జోథా అక్బర్, స్వదేశ్, రంగ్ దే బసంతీ, రాక్ ్టార్, రాంఝనా వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. 2009లో స్లమ్ డాగ్ మిలీనియర్ ద్వారా గుల్జార్ రాసిన జయహో సాంగ్ తో ఆస్కార్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. 2014 లో కొచ్చాడయన్, మిలియన్ డాలర్ ఆర్మ, ది హండ్రడ్ ఫుట్ జర్రీ సినిమాలకు కూడా ఆస్కార్ బరిలో నిలిచినప్పటికీ అవార్డులు గెలుచుకోలేకపోయాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AR Rahman  Pele Movie Ginga Song  Oscar Race  

Other Articles