ధ్రువ కోసం తానేమీ కష్టపడలేదంట... మరి మేకింగ్ వీడియోలోనో... | Ram Charan Speech At Dhruva re Release.

Dhruva pre release function details

Ram Charan, Dhruva pre release function, Ram Charan at Dhruva pre release, Cherry speech at Dhruva pre release, Celebs at Dhruva pre release, Ram Charan and KTR Dhruva pre release, KTR speech at Dhruva pre release, Ghanta at Dhruva pre release, Rakul at Dhruva pre release, Rana at Dhruva pre release

Ram Charan Druva pre release function details.

ధ్రువ ప్రీ రిలీజ్ పంక్షన్ సక్సెస్

Posted: 12/05/2016 08:51 AM IST
Dhruva pre release function details

సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతీ ఒక్క నటుడు ప్రేక్షకుడు కోసం కష్టపడుతూనే ఉంటాడని, ధృవ కోసం తాను పడిన కష్టం పెద్దదేం కాదని అంటున్నాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్. వేలాది అభిమానుల సమక్షంలో ధృవ ప్రీరిలీజ్ పంక్షన్ వేడుక కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో అట్టహాసంగా విజయవంతంగా జరిగింది. తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్, ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. ఇంకా వేడుకలో దర్శకుడు వివి వినాయక్, చిత్ర యూనిట్ పాల్గొంది.

దేవుడు ఎలా ఉంటాడో ఎవరూ చూడకపోయినా, మాకు మాత్రం మీరే దేవుళ్లు అంటూ ప్రేక్షకులను ఉద్దేశించి చెర్రీ మాట్లాడాడు. ఇంత దూరం వచ్చిన ప్రతీ అభిమానులకు కృతజ్నతలు తెలియజేశాడు. కథ తీసుకొచ్చిన ప్రసాద్ గార్కి స్పెషల్ థాంక్స్ చెప్పిన చెర్రీ... అల్లు అరవింద్, రకుల్, అరవింద స్వామి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పాడు. టాలీవుడ్ లో పుట్టడం అదృష్టమన్న చెర్రీ, ప్రేక్షకులను మెప్పించేందుకు ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నానని, ధ్రువ సినిమా ఖచ్ఛితంగా మెగా అభిమానుల ఆకలి తీరుస్తుందని తెలిపాడు. 

 


సడన్ సర్ ప్రైజ్...

మాట్లాడుతుండాగానే చెర్రీ స్టేజీ మీదే సడన్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. మెగా స్టార్ చిరంజీవి 150వ చిత్రం పోస్టర్ ను వదిలాడు. యాక్షన్ సీన్ కి సంబంధించిన ఫోజులో విలన్లను చితకబాదే సీన్ ను రిలీజ్ చేశాడు. ఈ విషయం నిర్మాత అయిన తనకీ కూడా తెలీదని, ఏర్పాటు చేసిన మామకి థాంక్స్ అంటూ అల్లు అరవింద్ ను ఉద్దేశించి పేర్కొన్నాడు. టీజర్ ను 8న రిలీజ్ ను చేసి, తర్వాతి రోజు నుంచి థియేటర్లలో సందడి చేయించేందుకు రెడీ అయిపోతున్నాడు చెర్రీ. 

Khaidi No 150 new poster

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dhruva pre release  Ram Charan  Speech  

Other Articles