ఎయిర్ పోర్ట్ లో రచ్చ చేసిన యూవీ జంట | Newly wed couple Yuvi and Hazel perform bhangra

Yuvi and hazel perform bhangra at airport

Yuvaraj Singh, Hazel Keech, Yuvi Hazel bhangra Goa, Yuvaraj Singh Wife, Yuvi wife name, Yuvaraj Singh Goa airport, Yuvi Couple at Goa airport, Goa Airport Bhangra, Yuvi wife Bhangra Dance Video, Yuvi at Goa Airport, Yuvaraj Singh with Wife, Yuvi dance with Wife, Yuvi Viral Video, Yuvaraj dance with wife Video, Yuvaraj wife Gurbasant Kaur, Hazel Keech Gurbasant Kaur, Hazel Keech husband

Yuvraj Singh and Hazel Keech perform `bhangra` at Goa airport.

రెండో పెళ్లికి ముందు భర్తతో చిందులేసింది

Posted: 12/03/2016 03:44 PM IST
Yuvi and hazel perform bhangra at airport

ఇదంతా టీంమిండియా స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ గురించే. కంగారుపడకండి... నటి హజల్ కీచే భార్య. కాకపోతే రెండోసారి హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. బుధవారం సిక్కుల సంప్రదాయ ప్రకారం చంఢీగఢ్ లో ఒక్కటైన ఈ జంట, శుక్రవారం గోవాలో మరోసారి వివాహం చేసుకుంది.

అల్రెడీ మొదటి పెళ్లి వేడుకలో తోటి క్రికెటర్లు, బాలీవుడ్ స్టార్లతో రచ్చ చేసిన ఈ జంట, మరోసారి డాన్స్ మూమెంట్లతో ఇరగదీసింది. పెళ్లికి ముందు గోవా ఎయిర్ పోర్ట్ లో కనిపించిన ఈ జంట బాంగ్రా డాన్సులతో హుషారెత్తించింది. కొత్త పెళ్లి కొడుకు యువీ మాంచి హుషారుగా, అతనికి పోటీగా సహధర్మచారిని కీచ్ కూడా స్టెప్పుల మీద స్టెప్పులు వేసింది. బాలీవుడ్ లెజెండరీ గీత రచయిత జావేద్ అఖ్తర్‌ను కలిసి, ఆయనతో ఫొటోలు కూడా తీయించుకుని ఎంజాయ్ చేశారు.

కాగా, బుధవారం జరిగిన వివాహ వేడుకకు సచిన్, ధోనీలతోపాటు పలువురు సెలబ్రిటీలు హాజరుకాగా, కోహ్లీ అనుష్క శర్మ జంటే హైలెట్ గా నిలిచింది. అనంతరం గోవాలో జరిగిన వివాహ వేడుకకు కూడా వీరు హాజరు కావటం విశేషం. ఇక పెళ్లి కోసం హజల్‌ కీచ్‌ తన పేరును గుర్బసంత్‌ కౌర్‌గా మార్చుకుంది. ఈ నెల 7న ఢిల్లీలో వీరి వివాహ రిసెప్షన్‌ జరగనుంది. దీనికి మోదీ సహా అమితాబ్, సచిన్ లాంటి దిగ్గజాలు హాజరయ్యే ఛాన్స్ ఉంది.

హజల్‌ కీచ్‌ తల్లి భారతీయురాలు కాగా, తండ్రి బ్రిటన్‌ వాసి. హజల్‌ తల్లి బిహార్‌కు చెందిన హిందువు. దీంతో ఇరు కుటుంబ సభ్యుల కోరిక మేరకు యువీ, హజల్‌ల వివాహాన్ని సిక్కు, హిందూ సంప్రదాయాల ప్రకారం నిర్వహించారు. కాగా, అజిత్ హీరోగా నటించిన బిల్లాతో పాటు, సల్మాన్ బాడీ గార్డ్ సినిమాలు, బిగ్ బాస్ సీజన్ 7 లో హజల్ పాల్గొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yuvaraj Singh  Hazel Keech  Goa Airport  Dance  Bhangra  

Other Articles