క్యారెక్టర్ నచ్చినా... కాంచనా ఎందుకు చేయలేదు | reason behind Kanchana refused role in Baahubali 2

Senior actress refused role in baahubali 2

Veteran Actress Kanchana, Kanchana Baahubali 2, Kanchana Baahubali, Kanchana Vijay Devarakonda, Kanchana re entry, Kanchana second innings, Kanchana, kanchana in Arjun Reddy

Veteran Actress Kanchana turned down role in 'Baahubali 2', here is the reason.

బాహుబలి-2... అందుకే నో చెప్పిందంట...

Posted: 12/03/2016 05:54 PM IST
Senior actress refused role in baahubali 2

బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా? పోనీ... బాహుబలి హిట్ రేంజ్ ను చూశాక... రెండో పార్ట్ లో అయినా అవకాశం వస్తే వదులుకుంటారా?  ఆ ఛాన్స్ కోసం ఎంతో మంది ఎగబడి పోతుంటే... సీనియర్ నటి ఒకరు మాత్రం ఆ అవకాశ చేజేతులారా వదులుకుంది. ఆమె ఎవరో కాదు అలనాటి తార కాంచన.

అవును... బాహుబలి-2 లో ఓ కీ రోల్ కోసం జక్కన్న కాంచనను సంప్రదించాడంట. అంతేకాదు ఆమెకు క్యారెక్టర్ కూడా బాగా కనెక్ట్ అయిపోవటంతో నటించేందుకు ఒప్పేసుకుంది. అయితే తీరా షూటింగ్ జోథ్ పూర్ లో, పైగా చలికాలంలో అనేసరికి ఆమె డ్రాప్ అయిపోయిందంట. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అంత దూరం రాలేనని రాజమౌళికి సారీ చెప్పేసిందంట. దీంతో మరో నటితో ఆ పాత్ర చేయించేశాడంట.

ఏది ఏమైనా బాహుబలి లాంటి తెలుగు సినిమాకి టెక్నాలజీ పరంగా కొత్త హంగులు దిద్దిన బాహుబలి లాంటి ప్రాజెక్టులో తాను భాగస్వామిని కాలేకపోయినందుకు బాధగానే ఉందని తెలిపింది ఈ లెజెండరీ యాక్ట్రెస్. అన్నట్లు 77 ఏళ్ల కాంచనా దాదాపు 31 ఏళ్ల తర్వాత మళ్లీ మేకప్ వేసుకోబోతుంది. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న అర్జున్ రెడ్డి చిత్రం లో ఓ ఫుల్ లెంగ్త్ రోల్ పోషించేందుకు రెడీ అయిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kanchana  Baahubali 2  vijay devarakonda  Arjun Reddy  

Other Articles