ఆ ఇద్దరితో కోరిక తీర్చుకుంటుందా? | keerthy Suresh desire about future projects.

Keerthy suresh wants to act under two ace directors

Keerthi Suresh, Mani ratnam and Gautam Menon, Keerthi Suresh desire, Keerthi Suresh two directors, Keerthi Suresh Mani ratnam, Keerthi Suresh Gautam Menon

Keerthi Suresh wants to act under Gautam Menon and Mani ratnam at Same Time.

కీర్తి కోరిక ఇప్పట్లో కష్టమే

Posted: 12/03/2016 02:43 PM IST
Keerthy suresh wants to act under two ace directors

కొత్త హీరోయిన్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న తరుణంలో ఏ మాత్రం హాట్ నెస్ లేకుండానే కీర్తి సురేష్ లక్కీ గర్ల్ గా మారిపోయింది. నేను శైలజా తర్వాత రైల్, రెమో లాంటి డబ్బింగ్ చిత్రాలతోనే పలకరించిన కీర్తికి తెలుగులో మాత్రం స్టార్ ఆఫర్లే వస్తున్నాయి. ప్రస్తుతం నాని నేను లోకల్ తో పాటు పవర్ స్టార్ త్రివిక్రమ్ సినిమాలో ఓ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కోలీవుడ్ లోనూ ఆమె చేతిలో విజయ్ భైరవా లాంటి బడా ప్రాజెక్టుతోపాటు మరో అరడజను ప్రాజెక్టులు ఉన్నాయి.

ఇక స్టార్ల సినిమాలు తన ఖాతాలో పడుతున్నప్పటికీ తనకు మాత్రం ఇద్దరు స్టార్ డైరక్టర్లు అంటే పిచ్చి అంటోంది కీర్తి. తన లైఫ్ లో ఆ ఇద్దరు క్లాసిక్ దర్శకులతో నటించడమే తన డ్రీమ్ అని చెబుతోంది. ఇంతకీ ఎవరంటారా? ఒకరు మణిరత్నం, మరోకరు గౌతమ్ వాసుదేవ మీనన్. ఎలాగైనా సరే ఆ ఇద్దరి దర్శకత్వంలో సినిమా చేయాలని తన స్నేహితులు కూడా తన మీద ఒత్తిడి తెస్తున్నారంట.

అయితే గతంలోనే ఈ ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా చేసే అవకాశాన్ని కీర్తి చేజేతులారా వదిలేసుకుంది. కార్తీ హీరోగా డ్యుయెట్ సినిమా, చైతూ సాహసం శ్వాసగా సాగిపో... చిత్రాలకు మొదట కీర్తి సురేష్ నే హీరోయిన్ గా ఎంపిక చేశారు. కానీ, ఎందుకనో ఆ ప్రాజెక్టుల నుంచి తప్పుకుంది. ప్రస్తుతం ఆ ఇద్దరు రెండేసి సినిమాలతో బిజీగా ఉన్నారు. కీర్తి కూడా రెండేళ్ల దాకా ఖాళీగా ఉండే అవకాశం లేదు. ఆ లెక్కన కీర్తి కల తీరాలంటే వెయిట్ చేయాల్సిందే...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Keerthi Suresh  Gautam Menon  Mani ratnam  

Other Articles