పెళ్లి చూపులకి గిరాకీ ఇంకా తగ్గట్లేదు | Pelli Choopulu remake rights sol for good rate.

Telugu smash hit set for its kannada remake

Pelli Choopulu, Pelli Choopulu remake, Pelli Choopulu Kannada remake, Pelli Choopulu rights, Pelli Choopulu Kannada movie, Pelli Choopulu Tamil, Pelli Choopulu Hindi

Tollywood sensation hit Pelli Choopulu ready for remake in several languages.

స్మాష్ హిట్ రీమేక్ కి రెడీ అయ్యింది

Posted: 11/24/2016 11:31 AM IST
Telugu smash hit set for its kannada remake

సమ్మర్ లో చిన్న సినిమాగా వచ్చి టాలీవుడ్ లో రికార్డుల ప్రభంజనం క్రియేట్ చేసింది పెళ్లి చూపులు. దెబ్బకి ఇందులో నటించిన విజయ్ దేవరకొండ, రీతూవర్మల కెరీర్ పీక్స్ లోకి వెళ్లిపోయి, వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి.  పెట్టుబడుల కంటే పది రెట్లు పైగానే వసూలు సాధించేసి టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించింది. దీంతో సాధారణంగానే ఇతర భాషల కన్ను ఈ సినిమా రీమేక్ పై పడింది. అందుకోసం భారీగా ఆఫర్ చేస్తూ ఆయా భాషల ప్రోడ్యూసర్లు ముందుకు వచ్చేస్తున్నారు కూడా.

ముందుగా శాండల్ వుడ్ తో ఈ చిత్ర రీమేక్ ఆరంభం కానుంది. యువనటుడు గురునందన్ హీరోగా, యూ టర్న్ సినిమా ఫేమ్ శ్రధ్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా, కన్నడలో డాన్స్ మాస్టర్ అయిన మురళి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. అతిత్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.

ఇక తమిళ్ లో ఇప్పటికే టాప్ దర్శకుడు గౌతమ్ మీనన్ హక్కులను దక్కించుకోగా, హిందీ వర్షన్ సల్మాన్ దక్కించుకన్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇదే కోవలో మిగతా భాషల్లో కూడా పెళ్లి చూపులకి మంచి గిరాకీ వస్తోందని సమాచారం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pelli Choopulu  Kannada Remake  Rights  

Other Articles