ప్రస్తుతం యువహీరోల జోరు మాములుగా లేదు. ఇంతకు ముందు హీరోలంటే ఏడాదికో, ఏడాదిన్నరకో ఓ సినిమా అన్న చందాన ఉండేవాళ్లు. అయితే విజయ్ సేతుపతి, నాని లాంటి దక్షిణాది హీరోల పుణ్యామాని సంవత్సరానికి మూడు, నాలుగు చిత్రాలతో సందడిగా ఉంటోంది.
కోలీవుడ్ స్టార్ హీరో, రజనీ అల్లుడు ధనుష్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈ యేడాది అల్రెడీ రెండు చిత్రాలతో వచ్చేశాడు. రైల్ చిత్రం అట్టర్ ఫ్లాప్ కాగా, రీసెంట్ గా వచ్చిన ధర్మయోగి దుమ్మురేపేసింది. ఇక ఇప్పడు అల్రెడీ సెట్స్ మీద మరో రెండు చిత్రాలు ఉన్నాయి. ఇంతలో బైలింగువల్ అంటూ వీఐపీ-2 సీక్వెల్ ను అనౌన్స్ చేసేశాడు కూడా. ప్రస్తుతం గౌతమ్ మీనన్ సినిమాతోపాటు, వెట్రిమారన్ దర్శకత్వంలోనూ ఓ మూవీలో యాక్ట్ చేస్తున్న ధనుష్, మరదలు సౌందర్య దర్శకత్వంలోనే వీఐపీ 2 చేయనున్నాడు.
ఇందుకోసం ముగ్గురు హీరోయిన్లు ఈ సినిమాలో నటించబోతున్నారని తెలుస్తోంది. అమలాపాల్ తోపాటు, కాజల్, మాంజిమా మోహన్ లు కూడా సినిమాలో నటించబోతున్నారని తెలుస్తోంది. ఈ రకంగా ఫస్ట్ టైం తన కెరీర్ లో ధనుష్ ముగ్గురు హీరోయిన్లతో జోడీ కట్టబోతున్నాడు. అయితే ఇది వీఐపీ-2 కోసమా? లేక గౌతమ్ మీనన్, వెట్రిమారన్ సినిమా కోసమా అన్నది మాత్రం స్పష్టత లేకుండా పోయింది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more