సెక్సీ యాడ్ పై రచ్చ రేపాడు.. దెబ్బకి దిగొచ్చారు | Siddharth slams Ranveer Singh's new ad campaign.

Tamil actor siddharth slams ranveer singh s new ad

Tamil actor Siddharth, Ranveer Singh's new ad, DON'T HOLD BACK ad, Chennai Jack and Jones Hording, Siddarth Ad, Siddharth slams Ranveer Singh, Jack & Jones, Jack and Jones ad controversy,

Siddharth slams Ranveer Singh's new ad campaign for Jack and Jones, calls it a fail.

సిద్దూ ట్వీట్ చేశాడు.. సెక్సీ యాడ్ తీసేశారు

Posted: 11/24/2016 08:48 AM IST
Tamil actor siddharth slams ranveer singh s new ad

సౌత్ లోనే కాదు.. బాలీవుడ్ లో కూడా పలు చిత్రాల్లో నటించి మెప్పించిన సిద్ధార్థ చేసిన ఓ పనికి సోషల్ మీడియాలో అభినందనలు కురుస్తున్నాయి. సిద్ధూకి సోషల్ రెస్పాన్సిబిలిటీ కాస్త ఎక్కువే. మరి మహిళలను అగౌరవపరిస్తే ఊరుకుంటాడా చెప్పండి? ఓ ప్రముఖ దుస్తుల కంపెనీ రూపొందించిన యాడ్ పై ఓ రేంజ్ లో ఫైరయ్యాడు. దీంతో ఆ సెక్సీ యాడ్ ను ఆ ప్రకటనను సదరు సంస్థ వెనక్కి తీసుకుంది.

చెన్నై నగరంలో జాక్ అండ్ జోన్స్ సంస్థ ఓ భారీ హోర్డింగ్ ను ఏర్పాటు చేసింది. అందులో బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న రణ్ వీర్ సింగ్ ఓ మోడల్ ను తన భుజాలపైకి ఎత్తుకుని వెళ్తూ ఉండగా, పక్కన DON'T HOLD BACK. TAKE YOUR WORK HOME అనే కాప్షన్ రాసి ఉంది.

అంతే మహిళలను కించపర్చే విధంగా ఉన్న ఆ క్యాప్షన్ పై హీరో సిద్ధార్థ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వ్యాఖ్యలు చేశాడు. కాగా, సిద్ధార్థ వ్యాఖ్యలకు నెటిజన్ల మద్దతు కూడా లభించింది. దీంతో రంగంలోకి దిగిన సదరు సంస్థ క్షమాపణ చెప్పింది. ఎవరినీ కించపరచడం తమ ఉద్దేశం కాదని, వెంటనే ఆ ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నామని చెప్పింది. యాడ్ ను వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించడంపై నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Siddharth  Ranveer Singh  Jack and Jones ad  

Other Articles