ఆ లెహంగా మొత్తం ఒరిజినల్ బంగారమే... | Gold Lehenga For Pragya Jaiswal in Om Namo Venkatesaya.

Gold lehenga for pragya jaiswal

Om Namo Venkatesaya, Pragya Jaiswal, Pragya Jaiswal Gols Lehenga, 14 kgs gold lehenga, Om Namo Venkatesaya,

Pragya Jaiswal's first look from the devotional film Om Namo Venkatesaya has been unveiled and the actress herself revealed to have worn 14 kgs gold lehenga.

పద్నాలుగున్నర కేజీల బరువుతో హీరోయిన్

Posted: 11/22/2016 02:53 PM IST
Gold lehenga for pragya jaiswal

సాధారణంగా చారిత్రక సినిమాల్లో బంగారు ఆభరణాల అవసరం అయినప్పుడు వాటి ప్లేస్ లో గిల్ట్ నగలను వాడటం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఆ మధ్య రుద్రమదేవి కోసం గుణశేఖర్, బాజీరావ్ మస్తానీ కోసం దీపికా, ప్రియాంక చోప్రాలకు నిజమైన నగలే తగిలించాడు సంజయ్ లీలా భన్సాలీ.

కోట్లకు కోట్లు ఖర్చైనా వెనకాడకుండా రిచ్ లుక్ కోసం వారు రిస్క్ కు కూడా సిద్ధమైపోతున్నారు. ఆ కోవలోకి దర్శకేంద్రుడు కూడా చేరిపోయాడు. తాజాగా నాగ్ కొత్త నమో వెంకటేశాయ చిత్రం కోసం ఇలాంటి ఫీట్ జరిగిందంట. అందులో ప్రగ్నా జైస్వాల్ ఓ కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఓ పాత్ర కోసం 14 కేజీల బంగారం తో చేసిన లెహంగానే ప్రగ్నా ధరించిందంట.

ప్రగ్నా ఫస్ట్ లుక్ సందర్భంగా ఎగ్జయిట్ అవుతూ ఆ విషయం చెప్పేసింది. చిత్రంలో ఓ పాట సందర్భంగా ఈ ఫీట్ చేసినట్లు ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాదు అతికష్టం మీద ఆ బరువును మోసినట్లు తెలిపింది. తన గత చిత్రాల్లో హీరోయిన్లను ఆకర్షణీయంగా చూపించనట్లే రాఘవేంద్రరావు ప్రగ్నాని కూడా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఓం నమో వెంకటేశాయలో నాగ్ బాబా హథీరాం పాత్రలో కనిపిస్తుండగా, కృష్ణమ్మ పాత్రలో అనుష్క, లక్ష్మీదేవిగా విమలారామన్ కనిపించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Om Namo Venkatesaya  PragnaJaiswal  Firstlook  14 Kgs Gold Lehenga  

Other Articles