శంకర్ ఇంక కాపీ పేస్ట్ మానడా? | Shankar Copied 2.0 firslook.

2 0 firslook copied from hollywood movie

Rajanikanth's 2.0 firstlook, 2.0 Movie firstlook, 2.0 Harry Potter and The Deathly Hallows, Harry Potter and The Deathly Hallows firstlook, 2.0 poster hollywood copy, Rajanikanth's 2.0 movie, Rajanikanth's 2.0 updates, Rajanikanth's 2.0 launch event, Rajanikanth's 2.0 firstlook launch, Rajanikanth Rakhi Sawanth, Rajni insult Rakhi Sawanth

Rajanikanth's 2.0 firstlook copied from Harry Potter and The Deathly Hallows.

రోబో రజనీ కూడా కాపీ పేస్టేనా?

Posted: 11/22/2016 04:14 PM IST
2 0 firslook copied from hollywood movie

రజనీకాంత్ అప్ కమింగ్ మూవీ 2.0 ఫస్ట్ లుక్ అట్టహాసంగా మొన్న ముంబైలో విడుదలైన విషయం తెలిసిందే. సల్మాన్, కరణ్ జోహార్లతోపాటు చిత్ర యూనిట్ సభ్యులంతా హాజరై సందడి చేశారు. గ్రాండ్ గా జరిగిన వేడుకలో ఫస్ట్ లుక్ ను చూసినవారంతా షాకయిపోయారు. రజనీ లుక్కు కన్నా అక్షయ్ లుక్కే కేక ఉందని, విలన్ అవతారంలో బాగా ఇమిడిపోయాడని అంతా పొగడ్తలు కురిపించారు.

పాజిటివ్ ఉన్న చోటే నెగటివ్ కూడా వస్తుంది కదా. అందుకే ఆరాలు తీయటం ప్రారంభించేశారు. శంకర్ కాపీ క్యాట్ అంటూ విమర్శలు మొదలుపెట్టేశారు. హాలీవుడ్ మూవీ హారీపోటర్ అండ్ ది డెత్లీ హాలోస్ సినిమా పోస్టర్ ను కాపీ కొట్టేశాడంటూ కామెంట్లకు దిగిపోయారు. అఫ్ కోర్స్ లుక్ కూడా అందుకు తగ్గట్లుగానే ఉందనుకోండి. గతంలో రోబో రిలీజ్ అయినప్పుడు కూడా రోబో కాప్, ఐ రోబో సినిమాలను కలిపి మిక్స్ చేసి రోబో తీశాడని శంకర్ పై సెటైర్లు పడిపోయాయి కూడా.

ఏది ఏమైనా వశీకరణ్, చిట్టి పాత్రలో మళ్లీ రజనీ, బ్యాడ్ మ్యాన్ గా డాక్టర్ రిచర్డ్ పాత్రలో అక్షయ్ కుమార్ 2.0 కోసం తలపడే సీన్ల కోసం అభిమానులు ఆత్రుతతో చూస్తున్నారు.

రజనీపై అలిగిన రాఖీ...

ఎందుకంటారా? 2.0 ఫస్ట్ లుక్ సందర్భంగా జరిగిన ఓ ఇన్సిండెట్ ఇందుకు కారణం. చిట్టి గెటప్ లో ఉన్న రజనీ కరణ్ అడిగే రాపిడ్ ఫైర్ ప్రశ్నలకు సమాధానమిస్తుంటాడు. బాలీవుడ్ క్వీన్ ఎవరనగానే మాధురీ దీక్షిత్, ఐశ్వర్యరాయ్, కత్రినా, దీపికా పదుకునే, అనుష్క శర్మ.. అంటూ చివర్లో రాఖీసావంత్ పేరు కూడా చెబుతాడు. ఆ సమాధానానికి షాకయిన కరణ్ ఇక చాలంటూ మరో ప్రశ్నకి వెళ్లిపోతాడు. అయితే తనపై సెటైర్ వేసే విధంగానే రజనీ తన పేరు చెప్పాడని రాఖీ తెగఫీలయిపోతుందంట. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajanikanth  2.0 firstlook  Hollywood Movie  Poster Copy  Rakhi sawanth  

Other Articles