విజయ్ ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా.. విడాకులు తప్పుడు నిర్ణయమే... | amala paul still in love with vijay.

Amala paul again opens up on break up

Amala Paul Vijay, Amala Paul Break Up, Amala Paul love, Amala Paul Vijay again, Amala Paul no divorce, Amala Paul wants Vijay, Amala Still in love, Amala Paul's Biggest Mistake, Amala wrong step

Actress Amala Paul again open up about break up, says that big mistake in her life, she still in love with Vijay,

సరైన సలహా ఇచ్చేవారు ఎవరూ లేకపోయారు

Posted: 11/22/2016 10:36 AM IST
Amala paul again opens up on break up

చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి ఎంటరై తనదైన శైలిలో దూసుకుపోతూ, టాప్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుని, హఠాత్తుగా పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది అమలాపాల్. డైరెక్టర్ విజయ్ ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఏడాది తిరగక ముందే భర్తతో విడిపోవాలని ఆమె నిర్ణయం తీసుకోవడంతో అందరూ షాక్ కు గురయ్యారు. విడాకులు కావాలంటూ ఆమె ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది.

విజయ్ పేరెంట్స్ పెట్టిన టార్చర్ తట్టుకోకలేకనే విడాకులు తీసుకుంటున్నానని తేల్చేసిన అమలా తన ఇంట్లోవాళ్ల సహకారంతో మిగిలిన లైఫ్ సినిమాలతోనే ముందుకు సాగిస్తానని చెప్పుకోచ్చింది. మధ్యలో హాట్ ఫోటో షూట్ లు, జాలీ ట్రిప్పులు, సినిమాలతో బిజీ అయిన అమల, ఇప్పుడు చాలా రోజుల తర్వాత తమ బ్రేకప్ గురించి మళ్లీ స్పందించింది.

తన జీవితంలో తాను తీసుకున్న అత్యంత బాధాకరమైన నిర్ణయం ఇదే అని ఆమె తెలిపింది. విజయ్ ను తాను ఇప్పటికీ ప్రేమిస్తున్నానని... ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని చెప్పింది. 18 ఏళ్లకే హీరోయిన్ అయిన తాను, 23 ఏళ్లకే పెళ్లి చేసుకున్నానని... ఏడాది తిరగక ముందే విడిపోవాలని అనుకున్నానని... అయితే, ఆ టైమ్ లో తనకు సరైన సలహా ఇచ్చేవారు ఎవరూ లేకపోయారని అమలాపాల్ తెలిపింది.

విజయ్ ను పెళ్లి చేసుకోవడం తప్పా? కరెక్టా? అనే విషయాన్ని పక్కనబెడితే... ఆ వయసులో పెళ్లి చేసుకోవడం మాత్రం తప్పే అని చెప్పింది. జీవితం ఎప్పుడు, ఎలా ఉంటుందో ఊహించడం చాలా కష్టమని తెలిపింది. అంత అయ్యాక ఆకులు పట్టుకుని ఏం లాభం అమలా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amala Paul  Director Vijay  Break Up  

Other Articles