తమ విందు అక్కడేనని చెప్పేసిన సమంత Samantha's Wedding Reception Venue Revealed

Samantha s wedding reception venue revealed

naga chaitanya, samantha, samantha and naga chaitanya wedding, samantha wedding, celebrities, movies, music, headlines, gossips, news, bollywood, tollywood, kollywood, mollywood

The impending wedding of top actress Samantha and Naga Chaitanya Akkineni has already been confirmed by all the parties involved.

తమ విందు అక్కడేనని చెప్పేసిన సమంత

Posted: 11/19/2016 04:43 PM IST
Samantha s wedding reception venue revealed

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత త్వరలో నాగచైతన్యతో పెళ్లికి రెడీ అవుతున్న విషయం స్వయంగా అక్కినేని నాగార్జునే కన్ఫాఫ్ చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు తమ పెళ్లి విషయమై కాబోయే జంట కూడా క్లారిటీ ఇచ్చేసింది. ఇదంతా సరే ఇప్పుడేంటి అంటారా..? తాజాగా కాబోయే వధువు తమ వివాహానికి సంబంధించిన విందును మాత్రం ఒక చోట ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. అదేంటి.? పెళ్లి ఎప్పుడు, ఎక్కడా అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వని జంట.. విందుకు మాత్రం వెన్యూను స్పష్టం చేశారా..? అన్న సందేహాలు వద్దు.

తాజాగా టీ గ్రిల్స్ రెస్టారెంట్ ఓపెనింగ్కు వెళ్లిన సమంతకు ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. నాగచైతన్యతో మీ వివాహం ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పకపోయినా.. మా రిసెప్షన్ మాత్రం ఈ రెస్టారెంట్ లోనే ఏర్పాటు చేస్తామని సమాధానమిచ్చింది సామ్. గతంలో సమాధానం చెప్పడానికి కాస్త ఇబ్బంది పడినా.. ఇప్పుడు మాత్రం అన్ని విషయాలను ఈ స్టార్ కపుల్  షేర్ చేసుకుంటున్నారు. సమంతా లాంచ్ చేసిన రెస్టారెంట్ ఆమె కాస్ట్యూమ్ డిజైనర్, ఫ్రెండ్ అయిన నీరాజ కోన, హీరో నితిన్ ను కలిసి చేస్తున్న బిజినెస్. ఈ ఇద్దరు సన్నిహితులే కావటంతో రెస్టారెంట్ ఓపెనింగ్ కార్యక్రమంలో ఈ బ్యూటి సందడి చేసింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha  reception  Naga Chaitanya  wedding  tollywood  

Other Articles

Today on Telugu Wishesh