బాలీవుడ్ బాద్ షాకు తృటిలో తప్పిన ప్రమాదం Big accident missed out for Shah Rukh Khan

Srk had a narrow escape while shooting for a cycling scene

Shah Rukh Khan, Shah Rukh Khan accident, Shah Rukh Khan, dear zindagi, Shah Rukh Khan, alia bhatt, Shah Rukh Khan gouri shinde, SRK, Accident, Dear Zindagi, Alia Bhatt, SRK, Bollywood.

Shah Rukh Khan is currently busy in the arrangements of 'Dear Zindagi' his new film with Alia Bhatt a big accident was rushed into him and missed out.

బాలీవుడ్ బాద్ షాకు తృటిలో తప్పిన ప్రమాదం

Posted: 11/20/2016 12:02 PM IST
Srk had a narrow escape while shooting for a cycling scene

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'డియర్ జిందగీ' చిత్ర షూటింగ్ లో అనుకోకుండా ఆయన ప్రమాదం బారిన పడి.. తృటిలో తప్పించుకున్నారు. డియర్ జిందగీ చిత్ర వర్గాల కథనం మేరకు ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ లో భాగంగా చిత్ర కథనాయకుడు, నాయికలైన షారుఖ్, అలియాలు గల్లీ రోడ్డులో సైకిల్ పై చక్కర్లు కొట్టే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు.

ఈ సన్నివేశానికి కావాల్సిన సామాగ్రిని ఓ టెంపోలో తీసుకొచ్చారు. టెంపో ఆగిన చోటే సైకిల్ పక్కన షారుఖ్ నిల్చున్నాడు. అయితే, షారుఖ్ ను గమనించని డ్రైవర్ టెంపోను స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు. దీంతో, అది సైకిల్ మీదనుంచి వెళ్లిపోయింది. దీన్ని గమనించిన షారుఖ్ వెంటనే పక్కకు తప్పుకోవడంతో... అతనికి పెను ప్రమాదం తప్పింది. దీంతో, యూనిట్ సభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే శరవేగంగా కొనసాగుతున్న డియర్ జిందగీ చిత్రం ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఈ చిత్రానికి గౌరీ షిండే దర్శకత్వం వహిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shah Rukh Khan  SRK  Accident  Dear Zindagi  Alia Bhatt  SRK  Bollywood.  

Other Articles