మరో భారీ మల్టీస్టారర్ కు రెడీ అవుతున్న టాలీవుడ్..? Puri Plans Multistarrer With Tarak and Bunny

Puri plans multistarrer with ntr and allu arjun

Puri Jagannath, allu arjun, jr ntr, puri jagannadh, puri ntr allu, puri multi stater, junior ntr allu, allu arjun ntr, celebrities, movies, music, headlines, gossips, news, bollywood, tollywood,

It looks like Allu Arjun and Jr NTR might come forward for an interesting multi starrer film to be directed by Puri Jagan.

మరో భారీ మల్టీస్టారర్ కు రెడీ అవుతున్న టాలీవుడ్

Posted: 11/19/2016 09:36 AM IST
Puri plans multistarrer with ntr and allu arjun

టాలీవుడ్ అభిమానులకు కన్నుల పండగగా నిలచేది మల్టీ స్టారర్ చిత్రాలే అని చెప్పడంలో సందేహం లేదు. తాజాగా ఫిల్మ్ నగర్ వీధుల్లో ఈ మల్టీ స్టారర్ సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతుంది. తెలుగు చలనచిత్ర వెండితెరపై ఓ భారీ మల్లీస్టారర్ కు రంగం సిద్ధమవుతుందన్న వార్త ఇప్పుడు చిత్రపురిలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పడి వరకు కనీవినీ ఎరుగని స్తాయిలో మల్టీ స్టారర్ చిత్రం రూపోందుతుందన్న వార్తలు ఇటు చిత్రసీమ అభిమానులలో కూడా ఆసక్తిని రేపుతున్నాయి

అటు నందమూరి ఇటు మెగా కుటంబాలకు సంబంధించిన హీరోలు కళ్యాణ్ రామ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల్టీ స్టారర్ సినిమా రెడీ అవుతుండగా, ఇదే తరుణంలో సరిగ్గా అదే కుటుంబాల కాంభినేషన్ లో మరో చిత్రం కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుందన్న వార్తలు అభిమానులలో ఉత్కంఠను రేపుతుంది. అది కూడా ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో కావటంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది.

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ భారీ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కనుందట. గతంలో అల్లు అర్జున్ హీరోగా దేశముదురు, ఇద్దరమ్మాయిలతో.. ఎన్టీఆర్ హీరోగా ఆంద్రావాలా, టెంపర్ లాంటి సినిమాలను తెరకెక్కించిన పూరి, ఈ ఇద్దరు హీరోల కాంబినేషన్ లో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే బన్నీ, ఎన్టీఆర్ కు కథ కూడా వినిపించాడన్న టాక్ వినిపిస్తోంది. మరి ఇంత భారీ చిత్రాన్ని నిర్మించాడానికి ఏ నిర్మాత ముందుకు వస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Puri Jagannath  Multi Starer  Ntr  Allu Arjun  entertainment  Tollywood  

Other Articles