హారర్ కామెడీ చిత్రంలో విజయ్ దేవరకొండ vijay devarkonda to act in horror comedy movie

Vijay devarkonda to act in horror comedy movie

vijaj in horror comedy movie, viajy in janar film, Pelli chupulu, Happy days, Uv creations, Vijay devarakonda, Horror Comedy, tollywood, dance show, judge, hyderabad

tollywood young hero Vijay devarakonda to sign an agreement with uv creations horror comedy movie

హారర్ కామెడీ చిత్రంలో విజయ్ దేవరకొండ

Posted: 11/19/2016 11:06 AM IST
Vijay devarkonda to act in horror comedy movie

నడుస్తున్న ట్రెండ్ తో పాటు పయనించి.. నాలుగు రూపాయలను వెనకేసుకోవాలని భావిస్తారు సిని నిర్మాతలు. ట్రెండ్ కొనసాగుతున్న తరుణంలో అలాంటి చిత్రాలలో నటించి మరింత గుర్తింపును పోందాలని, అభిమానులను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు యంగ్ హీరోలో. వారి జాబితాలోనే నిలిచాడు దేవరకొండ విజయ్. హ్యాపీ డేస్ నుంచి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నా.. ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంతో పాపులారిటీ సంపాదించిన నటుడు విజయ్.

ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిన విజయ్.. త్వరలోనే ఇండస్ట్రీలో ట్రెండ్ కొనసాగిస్తున్న హారర్ కామెడీల చిత్రంలో నటించనున్నారు. క్రమంగా సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ బాటలో పయనించిన విజయ్.. జానర్ సినిమాలలో కూడా నటించి తన మంచి నటుడిగా కూడా గుర్తింపును తెచ్చుకోవాలని యోచిస్తున్నాడు. సినీ దర్శకులు కూడా ఈ తరహా కథలతో సినిమాలు తెరకెక్కించేందుకు దర్శకులు కూడా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

తాజాగా ఇదే జానర్లో మరో ఇంట్రస్టింగ్ సినిమా పట్టాలెక్కనుంది. సక్సెస్ఫుల్ బ్యానర్ యువి క్రియేషన్స్ నిర్మాణంలో పెళ్లి చూపులు ఫేం విజయ్ దేవరకొండ హీరోగా ఓ హారర్ కామెడీ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం రిలీజ్కు రెడీగా ఉన్న ద్వారకతో పాటు మరో సినిమా  చేస్తున్న విజయ్, ఆ సినిమాలు పూర్తవ్వగానే యువి క్రియేషన్ సినిమా షూటింగ్లో పాల్గొననున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pelli chupulu  Happy days  Uv creations  Vijay devarakonda  Horror Comedy  tollywood  

Other Articles