సూపర్ స్టార్ ను మళ్లీ రోబోగా మార్చేసిన దర్శకుడు శంకర్ ప్రస్తుతం 'రోబో 2.0' చిత్రాన్ని శరవేగంగా తెరకెక్కిస్తున్నాడు. తలైవా సరసన ఎమీ జాక్సన్ హీరోయిన్ గా .. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కనిపించనున్నారు. ఈ సినిమా టైటిల్ లోగోను .. ఫస్టులుక్ ను ముంబైలో ఈ నెల 20వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొంతకాలం క్రితమే చెప్పారు.
రోబో సీక్వెల్ ‘2.0’ టైటిల్ లోగో అంటూ కొన్ని రోజుల కిందట ఒక ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. క్వాలిటీ ఓ రేంజిలో ఉండటంతో అది అఫీషియల్ లోగో అనే నమ్మారు జనాలు. కానీ అది అఫీషియల్ లోగో కాదని శంకర్ అండ్ టీ క్లారిటీ ఇచ్చింది. ఇక డైరక్టర్ శంకర్ ఇప్పుడు ‘2.0’ లోగోను అధికారికంగా లాంచ్ చేశాడు.
‘2.0’ మీద ఉన్న అంచనాలకు తగ్గట్లే ఉంది ఈ టైటిల్ లోగో. వందలాది రోబోల్ని చేర్చి ఈ లోగోను రూపొందించారు. క్లోజప్ లో చూస్తే లోగోలో రోబోలున్న సంగతి అర్థమవుతుంది. శంకర్ టెక్నికల్ బ్రిలియన్స్ ఈ లోగోలోనే తెలిసిపోతోంది. కింద మనిషి ఆకారం నీడ లాగా కనిపిస్తోంది. అయితే రజనీది మాత్రం కాదు. ఇందులో విలన్ పాత్ర పోషిస్తున్న అక్షయ్ కుమార్ ది. రజనీని కాకుండా అక్షయ్ ను హైలెట్ చేస్తూ ఫస్ట్ లుక్ వదలటం ప్రత్యేకంగా చెప్పుకొవచ్చు. ఎటోచ్చి రజనీ పేరు స్పెల్లింగ్ ను Rajni అని కాకుండా Rajanikanth అని వేయటం కొసమెరుపు. ఈనెల 20వ తారీఖున ముంబయిలోని ప్రముఖ యశ్ రాజ్ స్టూడియోలో ‘2.0’ ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేయబోతున్నారు. కరణ్ జోహార్ ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చే్స్తుండటం విశేషం.
#2Point0FirstLook pic.twitter.com/0MEvjPkiBJ
— Shankar Shanmugham (@shankarshanmugh) November 16, 2016
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more