ఆ రెండు ఫోటోలను జాగ్రత్తగా గమనించండి... | Pawan kalyan not changed his old notes.

Pawan notes change in bank fake

Pawan kalyan, Pawan in bank, Pawan Currency Change, Pawan Pic in Bank, Pawan Demonstration, Pawan in Bank, Pawan Kalyan Bank, Pawan Kalyan, pawan kalyan Keerthy Suresh, Keerthy Suresh Pawan Kalyan, Pawan Kalyan Trivikram Movie, Keerthy Suresh in Trivikram Movie, Pawan kalyan old notes exchange

Pawan kalyan Bank Photo Old one.

పవన్ ఫోటో తప్పు జరిగిపోయింది

Posted: 11/17/2016 10:35 AM IST
Pawan notes change in bank fake

పెద్ద నోట్లను కేంద్రం రద్దు చేసేయటంతో చేతిలో ఉన్న డబ్బులను డిపాజిట్ చేసుకోవచ్చనే ఆప్షన్ ఉంది. అయితే బ్లాక్ మనీ నియంత్రణ కోసం ఎవరి ఎకౌంట్ వాళ్లే అన్న నియమం ఉండటంతో అకౌంట్ గల వ్యక్తులే బ్యాంకుకు వచ్చి డిపాజిట్ చేయాలనే రూల్ ఉంది. దీంతో చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ బ్యాంకుల బాట పట్టక తప్పలేదు.

ఈ నేపథ్యంలో సెలబ్రిటీలకు కూడా ఈ కష్టాలు తప్పటం లేదు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే నోట్లు మార్చుకోవడానికి వచ్చాడంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఓ బ్యాంక్ లో కూర్చుని ఉన్న పవన్ కనిపించటంతో పవన్ ఓ బ్యాంకులో నోట్లు మార్చుకున్నాడంటూ వార్తలు వచ్చేశాయి. అయితే అది బ్యాంకే కానీ, ఇప్పటి ఫోటో కాదని ఈజీగా అర్థమౌతోంది. దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఒకటి కాటమరాయుడి కోసం కొత్త హెయిర్ స్టైల్ మార్చిన పవన్ కి, ఈ ఫోటోలో పవన్ కి చాలా తేడా ఉంది. రెండు నితిన్ సినిమా లాంఛ్ చేసి వెంటనే బ్యాంకు వెళ్లాడా? వెళ్లినా.. గెటప్ తేడాను రెండు ఫోటోలు ఈజీగా గమనించవచ్చు. ఇక ఫైనల్ గా అది గబ్బర్ సింగ్ షూటింగ్ సమయంలోదని చెప్పిన పవన్ ఆఫీస్ సిబ్బంది, నోట్లు మార్చుకునేందుకు వెళ్లాడన్న న్యూస్ ఫేక్ అని తేల్చేశాయి కూడా.

ఈ పుకార్ల సంగతి పక్కనపెడితే కాటమరాయుడు షూటింగ్ ముగింపు దశకు చేరుకోగా, తర్వాత త్రివిక్రమ్ సినిమా లైన్ లో ఉంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా సెలక్ట్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని కీర్తియే స్వయంగా వెల్లడించటం విశేషం.

keerthy suresh in Pawan Trivikram Movie

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : Keerthy Suresh  pawan kalyan  trivikram  Pawan Kalyan  Bank  notes Exchange  

Other Articles