కూతురు ఇడ్లీ అడిగినా కొనిపెట్టలేకపోయిన స్టార్ హీరో | vijay Sethupathi explains how he suffers with Modi's decision.

Demonstration effect on kollywood hero

Demonstration, shreeja Sethupathi,Vijay Sethupathi, Vijay Sethupathi daughter, Vijay Sethupathi Idly, Vijay Sethupathi Demonstration, Vijay Sethupathi Modi, Vijay Sethupathi old notes, Vijay Sethupathi currency

Vijay Sethupathi even not buy plate Idly to his ill daughter on the effect of Demonstration.

మోదీ డెసిషన్ తో కష్టాలు చవిచూశాడంట...

Posted: 11/17/2016 08:27 AM IST
Demonstration effect on kollywood hero

కొత్త నోట్ల ర‌ద్దు క‌ష్టాలు సామాన్య జనాలకే కాదు.. సెలబ్రిటీలకు కూడా తప్పట్లేదు. పాత నోట్లను మార్చుకునేందుకు సమయం ఉందని చెబుతన్నప్పటికీ, బ్యాంకులపై ఎగబడిపోవటం, చిల్లర దొరకపోవటం, పాత నోట్ల మార్పునకు సమయం ఉందని చెబుతున్నా వాటిని తీసుకునేందుకు ఎవరూ ధైర్యం చేయలేకపోవటం తదితర సమస్యలు ఇప్పుడు ఎదురవుతున్నాయి.

పెద్ద నోట్ల ర‌ద్దుతో కూతురి ఆక‌లి తీర్చలేక‌పోయాన‌ని ఓ స్టార్ హీరో ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాడు. పెద్ద నోట్లు ర‌ద్దు చేస్తున్న‌ట్టు మోదీ ప్ర‌క‌టించిన రోజున త‌న కుమార్తె శ్రీజ సేతుపతి తీవ్ర జ్వ‌రంతో బాధ‌ప‌డుతోంద‌ని, ఆస్ప‌త్రిలో చూపించుకుని ఇంటికి వెళ్తున్న స‌మ‌యంలో ఇడ్లీ కావాల‌ని అడిగింద‌ని తెలిపాడు. అయితే, ఆ స‌మ‌యంలో త‌న వ‌ద్ద రూ.500, రూ.1000 నోట్లు మాత్ర‌మే ఉన్నాయ‌ని, ఆ నోట్ల‌ను ఎవ‌రూ తీసుకోక‌పోవ‌డంతో ఇబ్బందులు ప‌డ్డాన‌ని వివ‌రించాడు. ఓ చేత్తో కుమార్తెను ప‌ట్టుకుని చిల్ల‌ర కోసం అవ‌స్థ‌లు ప‌డ్డాన‌ని పేర్కొన్నాడు.

కుమార్తె ఆక‌లి తీర్చ‌లేక‌పోయినందుకు తీవ్ర మాన‌సిక వేద‌న‌కు గుర‌య్యానన్నాడు. జేబులో స‌రిప‌డా డ‌బ్బులు ఉండి కూడా ఇబ్బందులు ప‌డ్డాన‌ని తెలిపాడు. పెద్ద‌నోట్ల ర‌ద్దు మంచిదే అయినా అమ‌లులో లోపాల వ‌ల్ల పేద‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌న్నాడు. ముందు జాగ్ర‌త్త‌లు తీసుకుని ఉంటే ఈ ప‌రిస్థితి త‌లెత్తేది కాద‌ని విజ‌య్ పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Sethupathi  Daughter  Shreeja Sethupathi  Demonstration  

Other Articles