వైఎస్ జగన్ నా క్లోజ్ ఫ్రెండ్.. అర్థరాత్రి ఏం చేసేవాళ్లమంటే... | sumanth about YS Jagan.

Sumanth close friend ys jagan

YS Jagan Mohan Reddy, Actor Sumanth, Sumanth Jagan, Jagan Sumanth, Sumanth about Jagan, Jagan about Sumanth, Sumanth and Jagan golden days, Sumanth about Jagan, Jagan sumanth relation

Actor Sumanth reveal another angle in YS Jagan.

జగన్ గురించి క్లోజ్ ఫ్రెండ్ ఏమంటున్నాడు?

Posted: 11/16/2016 03:47 PM IST
Sumanth close friend ys jagan

టాలీవుడ్ లో కొన్ని పరిచయాలు, సంబంధాల గురించి తెలిసినప్పుడు అవాక్కటమే కాదు, అవునా అనుకున్న సందర్భాలు బోలెడు ఉన్నాయి. సినిమాలకు, రాజకీయాలకు సంబంధం లేకపోయినప్పటికీ,  పలువురు రాజకీయ నేతలతో తారలు ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండటం మనకు అప్పుడప్పుడు తారసపడుతుంది. శుభకార్యాలు, పంక్షన్ లలో ఒకరినోకరు ఆప్యాయంగా పలకరించుకోవటం, కౌగింలించుకుని ఫోటోలు దిగటం లాంటి సీన్లు చాలానే చూశాం. కానీ, అక్కినేని హీరో సుమంత్ కి, వైసీపీ అధినేత జగన్ కి ఉన్న సంబంధం ఏంటో తెలిస్తే ఎవరికైనా షాక్ తగలాల్సిందే.

సుమంత్, జగన్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అంట. ఎంతలా అంటే ఒకే క్లాసు... ఒకే బెంచీలో కూర్చుని అల్లరి చేసేంతంగా. ఇక అప్పటి రోజులను గుర్తు చేసుకున్న సుమంత్, తన బెస్ట్ ఫ్రెండ్ జగన్ తో చేసిన అల్లరిని గుర్తు చేసుకున్నాడు.

ఓ రోజు బయట తిరిగేసి రాత్రి లేటుగా ఇంటికొచ్చిన సుమంత్ తాత నాగేశ్వర్ రావుకి తెలీకుండా  జగన్ తో కలసి దొంగతనంగా తన బెడ్ రూంలోకి వెళ్లబోయాడంట. ఆ టైంలో తాతయ్య అక్కినేని నాగేశ్వరరావుకు అడ్డంగా దొరికిపోయామని, దాదాపు 25 ఏళ్ల క్రితం జరిగిన ఆ ఘటనను నటుడు సుమంత్ పంచుకున్నాడు. తనతో ఉంది జగన్ అన్న విషయం నాగేశ్వర రావుకి తెలీదని, అప్పుడే ఆయనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్ అంటూ పరిచయం చేశానని సుమంత్ చెప్పుకొచ్చాడు. అలీ నిర్వహిస్తున్న ఓ ప్రోగ్రాంకి హాజరైన సుమంత్ ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు. అయితే రెండేళ్ల క్రితమే యాంకర్ సుమ చేసిన ఇంటర్వ్యూలో కూడా సుమంత్ ఈ విషయాన్నే షేర్ చేసుకోవటం విశేషం. జగన్ లోని ఈ యాంగిల్ ఎవరూ గెస్ చేయలేం కదా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkineni Sumanth  YS Jagan  Relation  

Other Articles

Today on Telugu Wishesh