విశాల్ పై బ్యాన్ పడింది.. ఇక సినిమాలు తీయడా? | Actor Vishal VFF suspended from Producers' Council.

Vishal removed from producers council

Vishal VFF, Kollywood Hero Vishal, Hero Vishal Reddy, Vishal Reddy, Vishal Film Factory, Ban on Vishal, TN Produvers council, Vishal TFPC, Vishal Case on Sarathkumar and Radha Ravi

Kollywood Hero Vishal temporarily suspended from producers council.

నటుడు విశాల్ సంచలన నిర్ణయం

Posted: 11/15/2016 08:22 AM IST
Vishal removed from producers council

సినీ నటుడు విశాల్ కు చెందిన చిత్ర నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ (వీఎఫ్ఎఫ్) సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తూ తమిళ నిర్మాతల మండలి (టీఎఫ్‌పీసీ) ఈ నిర్ణ‌యం తీసుకుంది. విశాల్ తాజాగా ఓ తమిళ మేగజిన్ కు ఇచ్చిన ఇంటర్వూలో ప‌లు వ్యాఖ్య‌లు చేసినందుకు గానూ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పేర్కొంది.

‘పైరసీని అరికట్టడంలో తమిళ సినీ నిర్మాతలు తీవ్రంగా విఫలమయ్యారు. వాళ్ల మీటింగులు బోండాలు, బజ్జీల గురించి చర్చించటానికే తప్ప ఇండస్ట్రీకి ఏ మాత్రం ఉపయోగం ఉండదు’ అని విశాల్ వ్యాఖ్యానించాడు. దీనిపై ఆగ్రహించిన ప్రముఖ నిర్మాతలు విశాల్ తమకు క్షమాపణ చెప్పాలంటూ నడియాగర్ సంఘాన్ని ఆశ్రయించారు. అంతేకాదు ఇటీవ‌లే తమిళ నిర్మాతల మండలి అతనికి నోటీసులు కూడా జారీ చేసింది. దీనిపై విశాల్ కూడా స్పందిస్తూ టీఎఫ్ పీసీకి ఓ లేఖ ద్వారా స‌మాధానం పంపాడు.

విశాల్ ఇచ్చిన వివరణ లేఖపై అసంతృప్తి వ్య‌క్తం చేసిన కమిటీ ఈ నిర్ణ‌యం తీసుకుంది. అయితే దీనిపై న్యాయపోరాటం చేస్తానని విశాల్ అంటున్నాడు. నిర్మాతల మండలి నిర్ణయం నాకు షాక్ కాదు, ఆశ్చర్యం కలిగించింది. ఇంతకు ముందు నటుడు కరుణాస్ ఇలాంటి వ్యాఖ్యలే చేసినప్పుడు చర్యలు తీసుకోలేదు. నడిఘర్ లో గతంలో ఇలాంటి పరిస్థితులే చోటుచేసుకున్నప్పుడు పోటీ చేశాం. ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకుంటున్నాం. నిర్మాతల మండలి ఎన్నికల్లో కూడా పోలీ చేస్తాం అంటూ విశాల్ ప్రకటించాడు. కాగా, బయటి బ్యానర్ లలో కాకుండా, సొంత కంపెనీ వీఎఫ్ఎఫ్ ద్వారానే విశాల్ చాలా సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే సీనియర్ నటుడు శరత్ కమార్ మీద విశాల్ పోలీస్ కేసు పెట్టబోతున్నాడట. నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నపుడు శరత్ కుమార్.. సంఘంలో మరో కీలక పదవిలో ఉన్న మరో సీనియర్ నటుడు రాధారవి కలిసి అక్రమాలకు పాల్పడినట్లు విశాల్ గుర్తించాడట. నడిగర్ సంఘానికి చెందిన ఓ స్థలాన్ని వాళ్లిద్దరూ అక్రమంగా సొంతం చేసుకున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నడిగర్ పరిణామాలు మరోసారి సౌత్ జనాలకు వివాదాల విందును పంచటం ఖాయంగా కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TFPC  Vishal  VFF  Suspended  

Other Articles

Today on Telugu Wishesh