ఆ ఇద్దరి మూలంగానే బబ్లీ బ్యూటీ ఇలా అయ్యిందా? | rashi Khanna about Ram and Sai dharam Tej

Rashi khanna about big hero opportunities

Rashi Khanna Dance, Rashi Khanna, Rashi Khanna Star Heroes, Rashi Khanna about Ram, Rashi Khanna about Sai Dharam Tej, Rashi Khanna 2016, Rashi Khanna skills, Rashi Khanna two heroes, Rashi Khanna movies, Rashi Khanna Ram Charan Tej

Rashi Khanna not bother about Star Heroes and Dancing skills improving. through Sai Dharam Tej And Ram.

రాశిలో మార్పులు ఆ ఇద్దరి వల్లే...

Posted: 11/14/2016 04:38 PM IST
Rashi khanna about big hero opportunities

ముద్దుగా, బొద్దుగా కనిపిస్తూనే యూత్ ను ఇట్టే అట్రాక్ట్ చేస్తూ టాలీవుడ్ లో హీరోయిన్ గా పాగా వేసింది రాశి ఖన్నా. మొదట్లో విమర్శలు వచ్చినా.. కెరియర్ గ్రాఫ్ మరీ స్పీడుగా పరిగెత్తకున్నా.. ప్రస్తుతం మాత్రం ఖాళీగా లేదు ఈ బబ్లీ బ్యూటీ. టాలీవుడ్ ఒక్కటే కాదు.. ఈ మధ్య కోలీవుడ్ లో కూడా మూడు సినిమాలకు సైన్ చేసి అక్కడ కూడా హవా చాటేందుకు సిద్ధమైపోతుంది.

అయితే ఇన్నాళ్ల కెరీర్ లో రాశి ఖన్నాకి ఇంతవరకూ స్టార్ హీరోల సరసన ఛాన్స్ తగల్లేదు. కేవలం కుర్ర హీరోల జోడీగానే అలరిస్తూ వస్తోంది. కానీ, అలా కుర్ర హీరోల సరసన నటించడమే తనకి బాగా కలిసొచ్చిందని రాశి ఖన్నా అంటోంది.

కెరియర్ ఆరంభంలో డాన్స్ విషయంలో తాను కాస్త వీక్ గా ఉండేదానినని చెప్పింది. రామ్ .. సాయిధరమ్ తేజ్ వంటి హీరోలతో కలిసి స్టెప్పులు వేయడం వలన, తనలోని డాన్సర్ పూర్తి స్థాయిలో బయటికి వచ్చిందని అంది. తనపై తనకి నమ్మకం కలగడానికి కారణం ఆ హీరోల చలవేననీ, ఇక స్టార్ హీరోల సరసన ఛాన్స్ వచ్చినా కంగారుపడనని చెప్పింది. ఈ మధ్యే రాంచరణ్ సుకుమార్ సినిమాకి ఆడిషన్ చేసిన రాశిఖన్నా దాదాపు ఫైనల్ అయినట్లేనని చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే.. రాశి దశ టర్న్ అయినట్లే...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rashi Khanna  Ram  Sai Dharam Tej  Dance  

Other Articles