ఆంధ్రా యూనివర్సిటీలో వర్మ కలకలం | Andhra University Student PhD On RGV

Phd on ram gopal varma life

RGV PhD, PhD on RGV, Andhra University Ram Gopal Varma, PhD on Varma's life, Praveen Yajjala RGV, RGV another book, Another book on RGV

Andhra University Ph.D student Praveen Yajjala research on director Ram Gopal Varma's life and make a book on Him.

పిచ్చోడి చేతిలో రాయి...

Posted: 11/04/2016 04:01 PM IST
Phd on ram gopal varma life

అదేంటీ వర్మ మళ్లీ ఏదైనా తిక్క పని చేశాడని అంత మాట అన్నాం అనుకున్నారా? కాదండీ బాబూ. రెండు దశాబ్దాలపైగా తన సినిమాలతో, చేష్టలతో సెన్సేషన్ అయ్యే వర్మను ఏమన్నా అనే ధైర్యం ఎవరికైనా ఉంటుందా? అలాంటిది ఎవరికీ అంతుబట్టని వర్మ జీవితంలోకి తొంగి చూడాలన్న ధైర్యం ఎవరైనా చేస్తారా చెప్పండి?   

కానీ, ఇక్కడో స్టూడెంట్ వర్మ జీవితం పై పరిశోధన చేస్తానంటూ అనౌన్స్ చేసి పెద్ద దుమారమే రేపాడు. ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన ప్రవీణ్ యజ్జల అనే వ్యక్తి తన పీహెచ్ డీ కోర్సులో భాగంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ లైఫ్ ను టాపిక్ గా ఎంచుకున్నాడు. ఇందుకోసం వర్మ జీవితంలోని పలు అంశాలను క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అతగాడు త్వరలో తెలుగులో ఓ బుక్ ప్రిపేర్ చేయబోతున్నాడని సమాచారం.  

ఇప్పటికే వర్మ నా ఇష్టం పేరుతో ఓ పుస్తకం, తాజాగా గన్స్ అండ్ థైస్ పేరుతో మరో పుస్తకం వదిలాడు. ఇదిగాక సిరాశ్రీ వోడ్కో విత్ వర్మ అనే పుసక్తం ఉండనే ఉంది. ఇవి చాలవన్నట్లు ఇప్పుడా విద్యార్థి బుక్ లో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో?. అన్నట్లు పైన టైటిల్ కు కింద హెడ్డింగ్ కు సంబంధం ఏంటంటారా?. పుస్తకం వర్మ గురించి కదా అందుకే అతని స్టైల్లో ఆ పుస్తకంకి కొందరు ఈ పేరును సజెస్ట్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra University  PhD student  Praveen Yajjala  RGV book  

Other Articles