ప్రముఖ టీవీ నటి, బాలికా వధు ఫేం ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో ఇప్పటికే పలు సంచలనాలు వెలుగులోకి రాగా, తాజాగా మరో షాకింగ్ న్యూస్ బయటపడింది. ప్రియుడు రాహుల్ తో ఆఖరిసారిగా మాట్లాడిన ఫోన్ టేపుల సంభాషణలు లీక్ కావటం గురించి ఓ జాతీయ పత్రిక ప్రత్యేక కథనం ప్రచురించింది. ఇందులో ఆమెను వ్యభిచార కుంపలోకి దించాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మూడు నిమిషాలు ఉన్న ఆ ఫోన్ కాల్ లో ప్రత్యూష వ్యభిచారం అనే పదం వాడినట్లు తెలుస్తోంది. "నటించడానికి - పనిచేయడానికే ఇక్కడికి వచ్చాను తప్ప - ఒళ్లు అమ్ముకోవడానికి రాలేదు.. కానీ ఈరోజు నన్ను నువ్వు ఎక్కడ ఉంచావు? రాహుల్... నీకు తెలీదు నేనెంతగా కుమిలిపోతున్నానో.. నువ్వు స్వార్థపరుడివి.. నా పేరును చెడగొట్టావు.. నా గురించి నా తల్లిదండ్రుల గురించి జనం చెడుగా మాట్లాడుకుంటున్నారు"... అంటూ ఫోన్ లో మాట్లాడిందంటూ ఆ కథనంలో పేర్కొంది. అయిపోయింది. అంతా అయిపోయింది. నేను వెళ్లిపోతున్నా అంటూ చివరిసారిగా ప్రత్యూష అందులో మాట్లాడిందంట. అయితే ఆమెను ఆపడానికి రాహుల్ ఫ్లాట్ కు వచ్చేసరికి అప్పటికే ఘోరం జరిగిపోయినట్లు తెలుస్తోంది.
ఈ విషయం ప్రత్యూష తరపు న్యాయవాది నీరజ్ గుప్తా కూడా బలపరుస్తున్నాడు. వ్యభిచారం చేయాలంటూ రాహుల్ చాలా ఒత్తిడి చేశాడని, చివరి ఫోన్ కాల్ లో దాని మీదే ఇద్దరి మధ్య వాదన కూడా జరిగిందంటూ ఆయన పేర్కొన్నాడు. అంతేకాదు పోలీసులు ఈ కేసులో విచారణ చాలా నిదానంగా చేస్తున్నారంటూ, పక్కదోవ పట్టించే ప్రయత్నాలు కూడా చేశారంటూ ఆయన ఆరోపిస్తున్నాడు.
అయితే ఈ విషయాలపై రాహుల్ వాదన మరోలా ఉంది. ఎలాగైనా డబ్బు సంపాదించాలని ప్రత్యూషపై ఆమె తల్లిదండ్రులే ఒత్తిడి తెచ్చారని.. ఇప్పుడు డబ్బుకోసమే ఆమె తల్లిదండ్రులు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాహుల్ చెబుతున్నాడు. ప్రత్యూషకు అవకాశాలు దొరకనప్పుడు తానే అండగా నిలిచానని చెప్పుకొస్తున్నాడు.
కాగా ఆంధేరిలోని అపార్ట్ మెంట్ లో ఏప్రిల్ 1న ఉరేసుకుని ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే! అయితే తాజాగా ఈ ఫోన్ సంభాషణలతో కేసులో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more