కుష్బూ పాత్ర ఆమెను పొలి ఉంటుందా? | kushboo pawan kalyan new aunt

Kushboo pawan new aunt

Pawan Kalyan new aunt, Devude digivochina aunty, devude digivochina kushboo, kushboo new aunt for pawan, after Nadiya trivikram Kushboo, Kushboo Nadiya, kushboo pawan kalyan

Kushboo re entry with Pawan kalyan trivikram new project devude digivochina.

పవన్-త్రివిక్రమ్ కొత్త అత్త ఎవరంటే...

Posted: 11/03/2016 08:20 AM IST
Kushboo pawan new aunt

టాలీవుడ్ హిస్టరీ లో అత్తారింటికి దారేది చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే రిలీజ్ కు ముందే ఈ చిత్రం ఒరిజినల్ ప్రింట్ ఆన్ లైన్ లో లీకైపోయింది. ఆ దెబ్బతో సినిమా పని అంతే అని అనుకున్నారు. కానీ, పవర్ స్టార్ క్రేజ్ ముందు అవేం పని చేయలేదు. పని గట్టుకుని కొందరు కుళ్లుబోతులు చేసిన ఈ పనిని పవన్ బహిరంగంగానే ఏకీపడేసి, చిత్ర ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్నతలు చెప్పాడు కూడా. అందుకే ఆ చిత్ర రికార్డులను ఎన్ని బ్రేక్ చేస్తున్న దాని ప్రత్యేకత దానిదే.

ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాతో చాలా కాలం తర్వాత నదియాకు మేకప్ వేయించి, పవన్ కి అత్తగా మార్పించేశాడు. సినిమా మొత్తానికి ఈ సెంటిమెంటే బాగా వర్కువట్ అయ్యింది. అప్పుడెప్పుడో 90లో వాణిశ్రీ లాంటి వాళ్లు చేసిన ఈ పవర్ ఫుల్ రోల్... చాలా కాలం తర్వాత నదియాలో చూసుకుని కొందరు ఆనందించారు. అయితే మళ్లీ పవన్ కోసం మరో పవర్ ప్యాక్ అత్తను తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

తమిళ స్టార్ నటి, రాజకీయ నేత కుష్బూను తమ నెక్ట్స్ ప్రాజెక్ట్ దేవుడే దిగివచ్చినా... లో ఓ పాత్ర కోసం తీసుకోవాలని ఈ ఇద్దరూ డిసైడ్ అయ్యాడంట. ఆ మేరకు ఆమెతో సంప్రదింపులు కూడ జరుగుతున్నాయని సమాచారం. ప్రస్తుతం ఓవైపు రాజకీయాలతోపాటు, టీవీ షోలలో బిజీగా ఉన్న కుష్బూ మెగా స్టార్ స్టాలిన్ తర్వాత మరోసారి మెరిసేందుకు అంగీకరించే అవకాశాలే ఉన్నాయి. స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి కావటంతో ఎల్లుండి ఈ చిత్ర ఓపెనింగ్ చాలా సింపుల్ గా జరిగే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Trivikram  devude digi vochina  aunty  Kushboo  

Other Articles