రానా నాగ చైతన్యకు బావ.. మరి సమంతకు? | Rana Daggubati Samantha sizziling chemistry for Bangalore Naatkal

Rana daggubati samantha sizziling chemistry for bangalore naatkal song

Rana Daggubati Samantha sizziling chemistry, Rana Samantha relation, Rana samantha romance

Rana Daggubati Samantha sizziling chemistry for Bangalore Naatkal Unnodu Vazha song.

కాబోయే భర్త కన్నా బావతోనే హై రొమాన్స్

Posted: 10/18/2016 03:21 PM IST
Rana daggubati samantha sizziling chemistry for bangalore naatkal song

అక్కినేని నాగచైతన్య-సమంత పెళ్లి వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. వచ్చే ఏడాది వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారు. అయితే ప్రస్తుతం ఏ సినిమాకు సైన్ చేయకుండా వెయిట్ చేస్తున్న సామ్ ఇంటి పనులు చేసుకుంటూ, కాబోయే భర్తతో పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ యేడాది మొదట్లో ఈ సౌత్ డాలీ గెస్ట్ రోల్ చేసిన ఓ సినిమా గురించి ఇప్పుడు డిస్కషన్ మొదలైంది. ఎందుకంటే ఆ సినిమాలో తను రొమాన్స్ చేసింది రానాతో కావటం మూలంగా...

మళయాళంలో హిట్ అయిన బెంగళూర్ డేస్ చిత్రాన్ని బెంగళూర్ నాట్కల్ గా తమిళంలో రీమేక్ చేశారు. ఇందులో ఆర్య, రానా, శ్రీదివ్య, బాబీ సింహ, రాయ్ లక్ష్మీలు ప్రధాన పాత్రధారులు. సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో తెలుగులో తీయాలన్న ఆలోచనను కూడా పక్కనపడేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సమంత ఓ రోల్ లో కనిపిస్తుంది. మళయాళంలో నిత్యామీనన్ చేసిన గెస్ట్ రోల్ ను ఇందులో సామ్ చేసిందన్న మాట.

ఇక కనిపించేది పది నిమిషాలే అయినప్పటికీ, రానాకు ఆమెపై ఓ పాట ఉంటుంది. అందులో రొమాన్స్ పాలు కాస్త ఎక్కువగానే ఉంది. చైతూ తో కూడా ఈ రేంజ్ లో ఇప్పటిదాకా కనిపించలేదు. దీంతో ఇప్పుడు ఈ పాటను వెలికి తీసి వారి కెమిస్ట్రీ గురించి వార్తలు రాసేస్తున్నారు. దగ్గుబాటి, అక్కినేని ఫ్యామిలీస్ కు చెందిన రానా, నాగ చైతన్యలు వరుసకు బావబామర్దులు. ఈ లెక్కన చై కి కాబోయే భార్య సమంత రానాకి ఏమౌతుందో మీరే లెక్కేసుకోండి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : Daggubati Rana  Samantha  chemistry  Bangalore Naatkal  

Other Articles

Today on Telugu Wishesh