ఏడాది తర్వాత శ్రీమంతుడు కొత్త రికార్డు | Mahesh babu Srimanthudu new record after one year

Srimanthudu audio youtube record

Mahesh Babu Srimanthudu record, Srimanthudu new record, Mahesh babu Srimanthudu audio record, Srimanthudu audio after one year

Mahesh Babu Audio Track new record in youtube.

ఏడాది తర్వాత మహేష్ మరో రికార్డు

Posted: 10/18/2016 03:17 PM IST
Srimanthudu audio youtube record

సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డమ్ ని ఓ మెట్టు ఎక్కించటంలో కీలకపాత్ర పోషించింది శ్రీమంతుడు సినిమా. ఊరిని దత్తత తీసుకోవటం అనే మంచి కాన్సెప్ట్ తో దర్శకుడు కొరటాల శివ మహేష్ ను కొత్తగా చూపిస్తూ తెరకెక్కించాడు. బాహుబలి తర్వాత ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగానే కాదు, ఆ సమయంలో వంద కోట్ల గ్రాస్ సాధించిన రెండో తెలుగు సినిమాగా నిలిచింది(ఇప్పుడు జనతా గ్యారేజ్ ఆ ప్లేస్ లో ఉంది). ఇక ఈ సినిమా రికార్డులు ఇక్కడితోనే ఆగిపోలేదు.

ప్రస్తుతం ఈ సినిమా ఇంకో రికార్డును నెలకొల్పింది. ఈ చిత్ర ఆడియో యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజైన శ్రీమంతుడు పాటలను, వారి అఫీషియల్ పేజీలో ఉంచగా, ఇప్పటిదాకా 80 లక్షల మంది వినటం ద్వారా కొత్త రికార్డు సాధించినట్లు అయ్యింది.

మైత్రి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చగా, మొత్తం ఆరు పాటలు ఉన్నాయి. 18 జూలై 2015న చిత్ర ఆడియో రిలీజ్ కాగా, సినిమా  ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 7న విడుదలై ప్రభంజనం సృష్టించింది. కాగా, తాజా ఫీట్ పై దేవీతో పాటు మైత్రి మూవీ మేకర్స్ హర్షం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh babu  Srimanthudu  audio  youtube record  

Other Articles