కేజ్రీవాల్ ను చెడుగుడు అడుకున్న వర్మ | RGV tweets on Kejriwal over anti-army comments

Rgv tweets on kejriwal over anti army comments

RGV tweets on Kejriwal, Kejriwal Monkey, RGV fire on Kejriwal, RGV Kejriwal, Kejriwal anti-nationalist, JaiAllahKejriwal

Ram Gopal Varma fire and tweets on Kejriwal over anti-army comments.

వర్మ దేశభక్తి ఇప్పుడు బయటపడింది

Posted: 10/06/2016 11:11 AM IST
Rgv tweets on kejriwal over anti army comments

అర్థరాత్రి నాన్ వెజ్ ట్వీట్లతో సందడి చేస్తున్న వర్మ ఒక్కసారి తన దేశభక్తిని ప్రదర్శించాడు. సర్జికల్ దాడుల వీడియోలు బయట పెట్టాలంటూ వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కుంటున్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తానూ ఓ రాయి వేశాడు. గతరాత్రి తన దైన శైలిలో సెటైర్లు వేయటమే కాదు.. కాస్త ఘాటైన విమర్శలే కురిపించారు.
 
సైనిక శక్తిసామర్థ్యాలను ప్రశ్నించిన కేజ్రీవాల్ హనుమాన్ సుగ్రీవ మరియు ముషరఫ్ షరీఫ్ లకు పుట్టిన క్రాస్ బ్రీడ్ జై అల్లా క్రేజీవాల్ అంటూ యాష్ ట్యాగ్ ఉంచాడు. ఇక ఆర్మీ ఇప్పటికే సరిహద్దు అవతల సర్జికల్ స్ట్రైక్ చేసిందని, ఇప్పుడు అంతర్గతంగా చేసి జాతి వ్యతిరేకుడు అయిన కేజ్రీని ఏసేయాలని పేర్కొన్నాడు.

మఫ్లర్ వేసుకునే కేజ్రీవాల్ ను చూసి ఇన్నాళ్లు తాను కోతిలా ఉన్నాడని అనుకునేవాడినని... తాజాగా, భారత సైన్యం శక్తి సామర్థ్యాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసి నిజంగానే కోతినని నిరూపించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న కేజ్రీవాల్ పై కూడా సర్జికల్ దాడులు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆప్ పార్టీ పేరును పాప్ (పాపి) పార్టీగా మార్చాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సర్జికల్ దాడులకు సంబంధించిన ఆధారాలు చూపాలంటూ కేజ్రీవాల్ చేసిన డిమాండ్ పై ఇప్పటికే పలువురు ప్రముఖులు, సోషల్ మీడియాలో  సైతం నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RGV  Kejriwal  Anti-national comments  Tweets  

Other Articles