హాలీవుడ్ సినిమా కోసం రానా అలాగన్న మాట | Rana lends voice to Tom Hanks for Inferno.

Rana lends voice to tom hanks inferno

Rana Hollywood debut, Rana lends voice to Tom Hanks, Rana in Hollywood blockbuster, Rana for Inferno dubbing, Rana lends voice to Hollywood Hero, After Jagapathi Babu now rana

Rana lends voice to Tom Hanks for Inferno dubbing version.

రానా హాలీవుడ్ డెబ్యూ అయిపోయిందా?

Posted: 10/06/2016 12:38 PM IST
Rana lends voice to tom hanks inferno

హాలీవుడ్ సినిమాలో నటించాలన్న కల ఒకప్పుడు మన స్టార్లకు అందని ద్రాక్ష గానే ఉండేది. కానీ, పెరుగుతున్న శాస్త్రీయత, మనోళ్ల టాలెంట్ మూలంగా ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. అడపా దడపా మన స్టార్లను హాలీవుడ్ ఆశ్రయిస్తూ వస్తోంది. ఇక అంతర్జాతీయ తెరపై కూడా మన నటీనటులు తమ టాలెంట్ మొత్తం చూపించేస్తున్నారు. అయితే బాలీవుడ్ నుంచే ఈ వలసలు ఎక్కువగా ఉండటం మనం గమనించవచ్చు. ప్రస్తుతం హాట్ బ్యూటీలు ప్రియాంక, దీపికలు హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు.

అది పక్కనబెడితే కొన్ని బ్లాక్ బస్టర్ హాలీవుడ్ చిత్రాలు సౌత్ భాషలలో డబ్బింగ్ అయి రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. పెరుగుతున్న మార్కెట్ ను దృష్టిలో పెట్టుకున్న ఆయా చిత్ర నిర్మాణ సంస్థల ఇండియాలో కూడా క్యాష్ చేసుకునేందుకు వీలుగా ముందు వాటికి క్రేజ్ తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే వాటిని డబ్బింగ్ చెప్పేందుకు టాప్ హీరోలను వాడుకుంటున్నాయి. ఇటీవల ది బి.ఎఫ్.జి అనే హాలీవుడ్ చిత్రానికి తెలుగులో జగపతి బాబు డబ్బింగ్ చెప్పి శభాష్ అనిపించుకున్నాడు. అదసలు జగ్గూ భాయ్ వాయిసేనా అన్న రీతిలో మనకు అనుభూతిని కలిగించాడు. ఇక ఇప్పుడు రానా వంతు వచ్చింది.

టామ్ హ్యాంక్స్ నటించిన ‘ఇన్ఫెర్నో’ అనే సినిమా అక్టోబర్ 28న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఓ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులోనూ డబ్ చేస్తున్నారు. తెలుగు వర్షెన్ కు టాలీవుడ్ కండల వీరుడు రానా తో డబ్బింగ్ చెప్పించారు. అలాగ రానా హాలీవుడ్ డెబ్యూ అయ్యిందన్న మాట. రోన్ హోవార్డ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇంగ్లీష్ లోనే కాక తెలుగులోను మంచి రికార్డులు క్రియేట్ చేయనుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rana  Dubbing  Hollywood Movie  Inferno  Tom Hanks  

Other Articles