బిజినెస్ మాన్ తో నటి నిఖిత పెళ్లి | Nikitha Thukral to wed Mumbai based business man

Nikitha thukral to wed mumbai based business man

Actress Nikitha wedding, Actress Nikitha Tie The Knot, Actress Nikitha Thukral, Actress Nikitha Marriage, Nikitha hubby Gagandeep Singh Mago, Gagandeep Singh Mago actress Nikitha

Actress Nikitha Thukral to wed.

పెళ్లి వార్తతో బాంబ్ పేల్చిన హీరోయిన్

Posted: 10/06/2016 10:45 AM IST
Nikitha thukral to wed mumbai based business man

ప్రముఖ సినీ నటి నిఖితా అభిమానులకే కాదు, ఇండస్ట్రీలోని సహచరులకు కూడా పెద్ద షాకే ఇచ్చింది. అక్టోబర్ 9న ముంబయికి చెందిన వ్యాపారవేత్త గగన్‌ దీప్‌ సింగ్ మాగో ను వివాహం చేసుకోనున్నట్లు హఠాత్తుగా అనౌన్స్ చేసింది. కాంగ్రెస్ నేత మహిందర్ సింగ్ కొడుకే ఈ గగన్ దీప్.

గత కొంత కాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారంట. ఇద్దరు ఒకే కులానికి చెందిన వారు కావటంతో పెద్దలు కూడా వీరి పెళ్లికి అడ్డుచెప్పలేదని తెలుస్తోంది. తమ కుటుంబాలు ముహూర్తాన్ని ఫిక్స్ చేసాయని,  ఈ నెల 9న ముంబైలోని ఓ స్టార్ హోటల్‌ లో తమ వివాహం ఘనంగా జరగనుందని నిఖిత తెలిపింది.

ఇక వివాహానంతరం సినిమాల్లో నటించడంపై భర్తతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని నిఖిత తెలిపింది. కాగా, 'హాయ్‌' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై 'కళ్యాణ రాముడు', 'సంబరం', 'ఖుషిఖుషీగా', 'డాన్‌', 'అనసూయ' తదితర చిత్రాలతో నిఖిత గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు కన్నడలో కూడా ఆమె పెద్ద చిత్రాల్లో నటించింది కూడా. కాగా, ఆ మధ్య స్టార్ హీరో దర్శన్ అఫైర్ నడిపి, అతని కాపురంలో చిచ్చు పెట్టిందంటూ శాండల్ వుడ్ ఆమెపై మూడేళ్ల నిషేధం కూడా విధించింది. ఆ విషయంలో తన భార్య విజయలక్ష్మిని కొట్టడంతో దర్శన్ జైలుకి కూడా వెళ్లాడు. అయితే ఆ ఆరోపణలతో మంచం పట్టిన నిఖిత తండ్రి కొన్నాళ్లకు మరణించగా, నిఖిత ఆస్పత్రి పాలయ్యింది. ఇక వ్యవహారం వివాదాస్పదం కావటంతో తర్వాత మండలి నిషేధం ఎత్తేసినట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉప్పీ-సుదీప్ ల క్రేజీ ప్రాజెక్టు గోపాల గోపాల రీమేక్ ముకుంద మురారిలో ఉపేంద్ర భార్య పాత్రలో(తెలుగులో శ్రీయా) నటిస్తోంది నిఖిత.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Nikitha  Wedding  Gagandeep Singh Mago  

Other Articles