సెక్సువల్ వేధింపులతో హీరోయిన్ అతిథి సూసైడ్ ప్రయత్నం | Actress Aditi attempts suicide for Sexual harassment

Actress aditi attempts suicide for sexual harassment

Actress Aditi attempts suicide, Aditi attempts suicide for Sexual harassment, Kollywood actress sexual harassment, Kollywood actress suicide attempt, director Selvakannan arrested, director Selvakannan Actress Aditi, Actress Aditi Kollywood. Aditi aka atira santhosh

Actress Aditi attempts suicide for Sexual harassment, alleges sexual harassment by director Selvakannan.

లైంగిక వేధింపులతో నటి ఆత్మహత్యాయత్నం

Posted: 10/04/2016 11:06 AM IST
Actress aditi attempts suicide for sexual harassment

ఓ దర్శకుడి వేధింపులతో అప్ కమింగ్ హీరోయిన్ ఒకరు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేరళకు చెందిన అధితి(అసలు పేరు అతిర సంతోష్) సినిమాలపై మక్కువతో కోలీవుడ్ కి వెళ్లింది. అక్కడ చిన్న చిన్న యాడ్ లు చేస్తున్న సమయంలో ‘నెడునాల్ వలై’ చిత్ర దర్శకుడు సెల్వకన్నన్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. సినిమాలో అవకాశం ఇస్తానంటూ ఆమెతో పరిచయం ఏర్పరుచుకున్నాడు.

ఆపై మెల్లిగా ప్రేమిస్తున్నానంటూ, పెళ్లి చేసుకోవాలంటూ ఆమెపై వేధింపులకు పాల్పడ్డాడు. అంతేకాదు భౌతికంగా ఆమెపై దాడికి కూడా పాల్పడ్డాడంట. దీంతో కొన్నాళ్లపాటు ఆమె తిరిగి సొంత వూరికి వెళ్లిపోయింది. తిరిగొచ్చాక కూడా అతిథిపై సెల్వకన్నన్ వేధింపులు ఆగలేదు. చివరకు ఆమెపై రేప్ ప్రయత్నం కూడా చేశాడంట. దీంతో విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది.

ప్రస్తుతం నడిఘర్ సంఘం కు చెందిన ఆస్పత్రిలోనే అతిథి చికిత్స పొందుతుంది. తాను నడిఘర్ లో సభ్యురాలిని కాకపోవటం మూలంగా సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రావటం లేదని ఆమె ఆరోపించింది. దీంతో రంగంలోకి దిగిన హీరో విశాల్ ఆమెను కలిసి న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kollywood Actress  Aditi  suicide attempt  director Selvakannan  

Other Articles