సల్మాన్ వ్యాఖ్యలపై తండ్రి సలీం ఏమంటున్నాడు? | Salim Khan hilariously slams Salman's anti-national marks

Salim khan supports salman comments

Salim Khan hilariously slams Salman's anti-national marks, Salim Khan on Salman's anti-national marks, Salman's anti-national marks, Salman Pak actors comment Salim khan, Salman Father slammed critics

Salim Khan hilariously slams Salman's anti-national marks.

సల్మాన్ ను ఉగ్రవాదితో పోల్చిన తండ్రి?

Posted: 10/04/2016 10:11 AM IST
Salim khan supports salman comments

ఓవైపు పరిస్థితి హీట్ ఎక్కి పీక్స్ లో ఉన్నప్పుడు పాక్ నటుల గురించి మాట్లాడి తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు సల్మాన్ ఖాన్. నటనకు, కళాకారులకు సరిహద్దులు ఉండవని, కాబట్టి పరిస్థితులను పట్టించుకోకుండా పాక్ కళాకారులంతా తిరిగి ఇండియాకు వచ్చేయాలని వ్యాఖ్యానించాడు. ఈ స్టేట్ మెంట్ పై అంతా మండిపడుతున్న సమయంలో దర్శకులు మహేష్ భట్, కరణ్ జోహర్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా సల్మాన్ మట్లాడిందాంట్లో తప్పేం లేదంటూ సమర్థించారు. దీంతో వారిని కూడా కలుపుకుని ఏస్కుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో సీనియర్ రచయిత, సల్మాన్ తండ్రి స్పందించాడు. విమర్శకులను ముఖ్యంగా మీడియాను, విమర్శించకుండానే విమర్శిస్తూ తన ట్విట్టర్ లో పోస్ట్ లు ఉంచాడు. సల్మాన్, మహేష్ భట్, కరణ్, ఏచూరిలు టైమ్స్ నౌ దృష్టిలో సయిద్, లక్వీ, మసూద్ (కరడుగట్టిన ఉగ్రవాదుల పేర్లు) గా మారిపోయారు. వీరంతా మనదేశ సమైక్యతకు తీవ్ర ప్రమాదంగా మారిపోయారు(మార్చేశారు) అని పేర్కొన్నాడు.

అంతేకాదు, అరవటం, ఇతరులను నిందించడం లాంటివి చేయకుండా(ఓ చానెల్ ను ఉద్దేశించి), ఏచూరి గారు దయచేసి ప్రశాంతంగా ఉండండి అప్పుడే మీ విలువలు కాపాడుకున్న వారు అవుతారు. ఇక భట్ జీ మంచి నటుల కోసం దయచేసి సరిహద్దు వంక చూడకండి అంటూ ఇలా ట్వీట్లు చేశారు. కాగా, సల్మాన్ వ్యాఖ్యలు చేసిన అనంతరం అతన్ని ఇంటికే పరిమితం చేయాలని శివసేన పార్టీ సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్‌కు సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సలీం ఇలా కొడుక్కి తిట్టినట్లు తిడుతూనే పరోక్షంగా విమర్శకులపై విరుచుకుపడ్డారన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saim Khan  Salman Khan  Anti-National Marks  

Other Articles