శాతకర్ణి కోసం మళ్లీ పంచాగం సెంటిమెంట్ | Muhurat Fixed For Gautamiputra Satakarni Teaser

Muhurat fixed for gautamiputra satakarni teaser

Satakarni Teaser, GSP Teaser, Balayya GSP teaser, Gautamiputra Satakarni Teaser, GSP teaser Muhurta, Balayya Panchagam Sentiment, Balayya Royal Look in GSP

Muhurat Fixed For Gautamiputra Satakarni Teaser on the occassion of Dussera.

శాతకర్ణి టీజర్ ముహుర్తం పెట్టేశాడు

Posted: 10/04/2016 12:32 PM IST
Muhurat fixed for gautamiputra satakarni teaser

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి టీజర్ ముహుర్తం ఫిక్స్ చేసేశారు. దసరాకి ఉంటుందని దర్శకుడు క్రిష్ ముందుగానే చెప్పినప్పటికీ ఒక రోజు ముందు నుంచే ఈ సందడిని షురూ చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఎప్పటిలాగాగే పంచాగం పాటించాలని బాలయ్య సూచించాడట కూడా.

ఇప్పటికే శ్రీయా, హేమామాలిని ఫస్ట్ లుక్ లు విడుదల చేయగా, ఇక ఇప్పుడు బాలయ్య విశ్వరూపం చూపించేందుకు ముహుర్తం పెట్టేసుకున్నారు. అక్టోబర్ 10న ఉదయం రాయల్ లుక్ లో ఉన్న బాలయ్య పోస్టర్ ని వదిలి, ఆపై విజయదశమిని పురస్కరించుకొని టీజర్ ను రిలీజ్ చేసేందుకు టైం కూడా సెట్ చేసేశారు. అక్టోబరు 11 ఉదయం 9 గంటలకి టీజర్ ని విడుదల చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే ఓ ప్రకటన విడుదల కాబోతోంది.

గత ఐదు నెలలుగా భారీ షెడ్యూల్స్ తో శాతకర్ణి షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. త్వరలో రామోజీ ఫిల్మ్ సిటీలో వేయబోతున్న భారీ సెట్ లో ప్రధాన తారాగణం మధ్య ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఆపై రెండు నెలలు పూర్తిగా సీజీ వర్క్ పూర్తి చేసి సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సాయిబాబు జాగర్లమూడి, వై రాజీవ్ రెడ్డి నిర్మాతలు గా వ్యవహారిస్తున్న ఈ చిత్రానికి కంచె ఫేం చిరంతన్ భట్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gautamiputra Satakarni  Balayya 100th Movie  GSP teaser  Dussera  

Other Articles