సమంత-చైతూ ప్రపోజ్ చేసుకోకుండానే లవ్ ఏంటీ? | naga chaitanya open love story with Samantha

Naga chaitanya open love story with samantha

Naga Chaitanya open love story, How Chaitu propose Samantha, Samantha not proposed Naga Chaitanya, Naga Chaitanya not proposed Samantha, No love between Samantha and Naga Chaitanya, Naga Chaitanya samantha next year Marriage, Naga Chaitanya Samantha

Naga Chaitanya open love story with Samantha in a Recent Interview.

సమంత-చైతూ లవ్ స్టోరీ లో ఓ ట్విస్ట్...

Posted: 10/01/2016 11:06 AM IST
Naga chaitanya open love story with samantha

తమ ప్రేమ వ్యవహారంలో చిక్కు ముడులు వీడిపోవటంతో ధైర్యం చేసి విషయాలను ఓపెన్ గా చెప్పేస్తున్నారు సమంత-నాగచైతన్య. ఈ మధ్య డేటింగ్ లో ఉన్నానంటూ సమంత, అవును అది నిజమేనంటూ చైతూ ప్రేమ వార్తలకు ఇప్పటికే పుల్‌స్టాప్ పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా పెళ్లి విషయంలోనూ క్లారిటీ ఇచ్చాడు చైతూ.

సమంత ఫోటో షూట్ ఆ.. హా...

వచ్చే ఏడాదే తను, సమంత టేస్ట్‌ఫుల్‌గా పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిపాడు. ప్రేమమ్ చిత్ర ప్రమోషన్ సందర్భంగా ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగచైతన్య సమంతతో తన లవ్ విషయాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చాడు. తామిద్దరం ప్రేమలో ఉన్న విషయం కుటుంబ సభ్యులందరికీ తెలుసని పేర్కొన్నాడు. వృత్తి పరంగా ఆర్భాటాలు తప్పవని కానీ, వ్యక్తిగతంగా తనకు, సమంతకు అది నచ్చదని చెప్పాడు. వచ్చే ఏడాది బంధుమిత్రుల సమక్షంలో టేస్ట్‌ఫుల్‌గా పెళ్లి చేసుకుంటామని వివరించాడు. ‘ఏమాయ చేసావె’ సినిమాలు చేస్తున్పటి నుంచే సమంతతో పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత తమకు తెలియకుండానే ‘బెస్ట్ ఫ్రెండ్స్’గా మారిపోయామని తెలిపాడు.

సమంత బొట్టు ఎవరిగోల వారిదే!

ఎలా ప్రపోజ్ చేశాడంటే...
తమది ఏ ఒక్కరోజులోనో పుట్టిన ప్రేమ కాదని పేర్కొన్న చైతూ ఇప్పటి వరకు ఒకరికొకరం ప్రపోజ్ చేసుకోలేదని పేర్కొన్నాడు. తనకు 30 ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందని, అప్పుడు సమంత తప్ప మరే అమ్మాయి గుర్తుకు రాలేదన్నాడు. ఈ ఏడాదిలోనే తాను సమంత వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చినట్టు చైతూ పేర్కొన్నాడు. ఓరోజు సమంత వద్దకు వెళ్లి ‘‘ఎన్ని రోజులు ఇలా బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్‌గా ఉంటాం. పెళ్లి చేసుకుందాం. నాకు నువ్వు కరెక్ట్ అనిపిస్తోంది’’ అని చెప్పానని తెలిపాడు. పెళ్లి వద్దనుకుంటే మాత్రం ఇక్కడితో ఆపేద్దామని అన్నట్టు వివరించాడు. అప్పుడే తన ఇష్టాన్ని సమంత వ్యక్తం చేసిందని, ఆ క్షణమే తామ పెళ్లితో ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నామని నాగచైతన్య చెప్పినట్లు ఆ కథనంలో ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naga Chaitanya  Love Story  Samantha  No Proposal  

Other Articles