సమంతపై నాగ్ పంతం నెరవేరిందా? | Samantha Changed Her Religion Christianity to Hindu

How much truth behind samantha changed her religion christianity to hindu

Samantha Changed Her Religion, Samantha Christianity to Hindu, samantha religion change, Samantah did it Nagachaitanya, Samantha Christianity, Nag Condition to samantha for Religion Change

Samantha Changed Her Religion Christianity to Hindu Published with Photos.

సమంత బొట్టు ఎవరిగోల వారిదే!

Posted: 09/26/2016 05:51 PM IST
How much truth behind samantha changed her religion christianity to hindu

ప్రేమ వ్యవహారం, పెళ్లి పీటలు ఎక్కేంతవరకు సమంత-నాగచైతన్య ఏం పని చేసినా ఇప్పుడు వార్తల్లోకి ఎక్కేస్తున్నాయి. నిమ్మగడ్డ కూతురి ఫంక్షన్ లో సచిన్ సహా అందరికీ పరిచయం చేయటం దగ్గరి నుంచి మీడియాలో త్వరలో కొడుకు పెళ్లిళ్లను స్వయంగా ప్రకటిస్తానని చెప్పటం, చైతూతో డేట్ లో ఉన్నానంటూ సమంత కూడా ఓపెన్ గా ప్రకటించడంతో ఇప్పుడు మొత్తం మీడియా కళ్లన్నీ వాళ్ల మీదే ఉంటున్నాయి.

తాజాగా నాగ్, చైతన్యలతో సమంత ఉన్న ఫోటో కన్నా, అందులో సమంత బొట్టు గురించే ఎక్కువ డిస్కషన్ లు జరుగుతున్నాయి. పెళ్లి ఇరు సంప్రాదాయాల ప్రకారం జరుగుతుందని ఇంతకు ముందే వార్తలు గుప్పుమనగా, ఇప్పుడు ఏకంగా సమంత మతం మార్చేసుకుందని అందుకే బొట్టు పెట్టుకుందంటూ కథనాలు రాసేస్తున్నారు. అక్కినేని కుటుంబానికి చెందిన ఓ పూజాకార్యక్రమంలో సమంత, చైతూలిద్దరూ పాల్గొనగా, అక్కడ పూజారులు ఎక్కువగా ఉండటం, పైగా ఫోటోల్లో నాగ్ కూడా కనిపిస్తుండటంతో మతం మార్చేశారంటూ వార్తలు వచ్చేస్తున్నాయి.

Samantha convert into Hinduism
 
అయితే సమంతకు మత పట్టింపులు అంతగా లేవన్న విషయం ప్రస్తావిస్తూ మరి కొందరు కథనాలు రాసేస్తున్నారు. సినిమా ఓపెనింగ్ లకు, పలు కార్యక్రమాల్లో సమంత బొట్టు పెట్టుకుని చాలా సార్లు కనిపించింది. అంతేందుకు గతంలో నటుడు సిద్ధార్థతో ప్రేమలో మునిగి తేలినప్పుడు శ్రీకాళహస్తిలో రాహుకేత పూజల్లో పాల్గొంది. ఆ సమయంలో వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని, అందుకే ఆ పూజల్లో పాల్గొన్నారని, పైగా సిద్దూ పేరేంట్స్ కూడా అందులో ఉండటంతో అది మరింత హైలెట్ అయ్యింది. ఇక ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ తో సమంత పూజలో కేవలం బొట్టు పెట్టుకుని కనిపించినంత మాత్రానా ఏకంగా మతం మార్చేసుకుందంటూ రాసేస్తున్నారంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఇందులో ఏది నిజం ఎలా తెలుస్తుందబ్బా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha  Religion  Christian  Naga Chaitanya  Hindu  Pujas  

Other Articles