చనిపోయిన హీరోతో ఫైటింగ్ లు చేయించాడు | Nagabharanam trailer released

Nagabharanam trailer released

Nagarahuvu, Vishnuvardhan 201 movie, Nagarahuvu Dubbed Telugu as Nagabharanam, Nagabharanam Trailer, vishnuvardhan fights in nagabharanam, Demise Hero back again, Nagarahavu trailer, Late Hero in Action mode

Kodi Rama Krishna Directorial Venture Nagarahuvu Dubbed Telugu as Nagabharanam Trailer Released.

సంచలన సినిమా ట్రైలర్ వచ్చేసింది

Posted: 09/20/2016 04:10 PM IST
Nagabharanam trailer released

ఇప్పుడున్న నిర్మాతలు ధైర్యం చేసి ముందుకు రావటం, విదేశీ నిపుణుల చాతురత్యంతో భారీ గ్రాఫికల్ వండర్స్ మన ముందుకు వస్తున్నాయి. కానీ, 90వ దశకంలోనే పూర్తి స్థాయి దేశీయ టెక్నీషియన్స్ తోనే సౌత్ సినిమాలకు భారీ గ్రాఫిక్స్ ను రుచిచూపించాడు లెజెండరీ దర్శకుడు కోడి రామకృష్ణ.  అమ్మోరు, దేవీ, దేవీ పుత్రుడు, అంజి, అరుంధతి చిత్రాలు మచ్చుకు అందుకు ఉదాహరణలు. ఒక్క తెలుగులోనే కాదు కన్నడలోనూ ఆయన భారీ గ్రాఫిక్స్ చిత్రాలను తీశాడు కూడా. తాజాగా ఓ చిత్రం గురించి కొన్ని నెలలుగా ఆయన తీయబోయే ఓ చిత్రం గురించి హాట్ డిస్కషన్ జరుగుతోంది.

కన్నడ లో నాగరహవు అంటూ ఓ విజువల్ వండర్ గా తెరకెక్కించాడు ఆయన. ఈ చిత్రంపై హైప్ ఉండటానికి కారణం మూడు విషయాలు. ఒకటి ఏడేళ్ల క్రితం చనిపోయిన కన్నడ దిగ్గజ నటుడు విష్ణువర్థన్ ను గ్రాఫిక్స్ మాయాజాలంతో ఇందులో నటింపజేయటం(ఆయన 201వ చిత్రంగా పేర్కొనటం విశేషం). రెండోది శాండల్ వుడ్ హాట్ బ్యూటీ రమ్య ఈ చిత్రంతో లాంగ్ గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇవ్వటం, మూడోది అవతారం(తెలుగులో కూడా అవతారం)తో కన్నడనాట రికార్డులు సృష్టించిన కోడి రామకృష్ణ దర్శకుడు కావటం.

సాహస సింహ విష్ణువర్థన్ ఇప్పుడు బతికి ఉంటే ఎలా ఉంటారో అన్న దానిని బేరీజు వేసుకుని విజువల్ గా ఇమేజ్ ను క్రియేట్ చేయటమే కాదు, ఏకంగా ఆయనతో ఫైటింగ్ లు కూడా చేయించాడు. 200 అడుగులు పాము, భారీ శివలింగం చూడటానికి భారీ హంగులతో సూపర్బ్ గా ఉంది. సినిమా కోసం 576 మంది గ్రాఫిక్ ఆర్టిస్ట్లు సుమారు రెండేళ్ల పాటు శ్రమించారు. డైలాగ్ కింగ్ సాయికుమార్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు సిద్ధమైపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kodi Rama Krishna  Nagabharanam  Trailer  Vishnuvardhan  

Other Articles