ప్రేమమ్ రీమేక్ వెనుక కారణాలు | naga chaitanya speech at Premam audio launch

Naga chaitanya speech at premam audio launch

Nagarjuna and Naga Chaitanya speech at Premam audio, Nagarjuna Gaddam, Nagarjuna Premam Audio, Naga Chaitanya Premam Audio

Nagarjuna and Naga Chaitanya speech at Premam audio launch.

ఒరిజినల్ ను చెడగొట్టాలని కాదు

Posted: 09/21/2016 10:27 AM IST
Naga chaitanya speech at premam audio launch

ప్రేమమ్ మళయాళంలో రికార్డులు కొల్లగొట్టిన చిత్రం. మూడు ప్రేమలతో తెరకెక్కిన హృదయకావ్యం ఒక్క మాలీవుడ్ లోనే కాదు, సౌత్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కార్తికేయ ఫేం చందు మొండేటి అక్కినేని నాగ చైతన్యతో తెరకెక్కించాడు. లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వర రావు పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం చిత్ర ఆడియో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకరత్న ముఖ్యఅతిధిగా హాజరయి ఆడియోను లాంఛ్ చేశారు.

తన కొడుకు చైతన్యను ఆశీర్వదించడానికి విచ్చేసిన కింగ్ నాగార్జున.. మాంచి ఇంట్రెస్టింగ్ కామెంట్లే చేశారు.  ''నాన్నగారి ప్రేమాభిషేకం.. నా గీతాంజలి.. వాటికి సరిపోయే ప్రేమకథ ప్రేమమ్. మలయాళంలో చాలామంది చూసే ఉంటారు. పెద్ద సూపర్ హిట్ ఫిలిం. ఇక్కడ కూడా అంతా సూపర్ హిట్ అవుతుందని నా నమ్మకం'' అంటూ చెప్పుకొచ్చారు.

ముఖ్యంగా ఆయన చైతూ గడ్డం గురించి మాటా్లడుతూనే.. అక్కినేని అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించేశారు. ''చైతన్య గెడ్డం చూసినప్పుడు నాకు చైతన్య గెడ్డం బాగుంది అనిపించి.. నేను ఓం నమో వెంకటేశాయ సినిమా కోసం గెడ్డం పెంచాను. అప్పటి నుండి చైతూ ఏమంటున్నాడంటే.. నాకంటే నీ గెడ్డమే బాగుంది అని కామెంట్ చేస్తున్నాడు. మీరే చెప్పండి.. ఎవరి గెడ్డం బాగుంది?'' అంటూ కామెంట్ నాగార్జున ఆడియన్స్ ను ఉర్రూతలూగించాడు.

Premam Movie Audio Launch

'దర్శకుడు చందూని ఒక రీమేక్ చేయమని అడగటం చాలా పెద్ద తప్పేనని నాగ చైతన్య తెలిపాడు. ఈ సినిమా రిలీజయ్యాక నేను నీ సొంత కథతో ఎప్పుడైనా కూడా ఒక సినిమాను చేయడానికి రెడీగా ఉన్నాను. అలాగే ఈ ప్రొడ్యూసర్లకు కూడా సినిమా చేస్తాను'' అంటూ చందూని ఉద్దేశించి సెలవిచ్చాడు చైతూ. ఇకపోతే ఈ కార్యక్రమంలో తదుపరి మాట్లాడిన చైతన్య.. ''బాధ సంతోషం హిట్టయినా ఫ్లాపైనా కొన్ని సంవత్సరాల నుంచి నన్ను సపోర్టు చేస్తోంది అక్కినేని అభిమానులే. ఒరిజినల్ కంటే బాగా చేద్దాం.. ఆ హీరోకంటే బాగా చేద్దాం.. అలాంటి ఇంటెన్షన్ తో ఈ సినిమా చేద్దామని అనుకోలేదు. మేం అక్కడున్న టెక్నీషియన్లను అందరినీ ఎప్రిషియేట్ చేస్తూ ఈ సినిమా తీశాం. అలాగే తెలుగు ప్రేమమ్ రిలీజయ్యాక అక్కడి టెక్నిషియన్లు ఇక్కడ వారందరినీ అభినందిస్తారు'' అని చెప్పాడు. ఈ సినిమాలో అందరూ ఎంతో గొప్ప ఎఫర్ట్ పెట్టి చేశారని.. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు నాగ చైతన్య.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkineni Nagarjuna  Naga Chaitanya  Premam Audio Launch  

Other Articles