లెజెండ్ సింగర్ పై నోరు జారిన ఝాన్సీ | anchor Jhansi comments on Yesudas

Anchor jhansi comments on yesudas

jhansi Yesudas, Anchor Kills Legendary Singer, Anchor Jhansi on Yesudas, Yesudas Amara Singer, Telugu Anchor Jhansi, Telugu Anchor Kills Legendary Singer, Jhansi Kills Yesudas, Yesudas felicilated by Manalo Okkadu team, Manalo Okkadu Audio Success, Jhansi at Manalo Okkadu Audio Success

Anchor Jhansi's Irresponsible Comment on Legendary singer Yesudas.

లెజెండ్ సింగర్ పై నోరు జారిన ఝాన్సీ

Posted: 09/20/2016 02:36 PM IST
Anchor jhansi comments on yesudas

యాంకర్లు పంక్షన్ లలో వాక్ చాతుర్యం ప్రదర్శించే క్రమంలో అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతుంటాయి. వేదికలపై వాళ్ల నోటి వెంట తప్పు పదాలు దొర్లిపోతుంటాయి. అయితే, విపరీత అర్థాలతో కూడిన పదాలు గనుక వస్తే మాత్రం నష్టం పెద్ద ఎత్తునే ఉండటమే కాదు, విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. సరిగ్గా యాంకర్ ఝాన్సీ కూడా అలాంటి తప్పిదమే ఒకటి చేశారు. లెజెండరీ సింగర్ ను అమరుడంటూ సంభోదించడంపై ఆమె ను సోషల్ మీడియాలో ఏకేసుకుంటున్నారు.

విషయం ఏంటయా అంటే... ఆర్పీ పట్నాయక్ చిత్రం మనలో ఒక్కడు సినిమా ఆడియో సక్సెస్ మీట్ సోమవారం సాయంత్రం జరిగింది. ఇక ఈ సినిమాలో ఓ పాటపాడిన ప్రముఖ సినీ గాయకుడు ఏసుదాసుకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఝాన్సీ  ఏసుదాసు గురించి చెపుతూ... 'అమర గాయకుడు ఏసుదాసు గారు' అని సంబోధించింది. అంతే అక్కడున్న వారంతా ఒక్కసారిగా దిగ్ర్భాంతికి లోనయ్యారు. ఇంకోదరు నవ్వుకున్నారు. అయితే అవేం పట్టవన్నట్లు ఆమె తన ప్రసంగం కొనసాగించుకుంటూ వెళ్లిపోయింది.

వేదికల మీద వ్యాఖ్యాతగా వ్యవహరించే ఆచీ తూచీ మాట్లాడటం మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏ చిన్న తప్పిదానికి చోటిచ్చినా.. అందరిలో నవ్వులపాలు కావాల్సిందే గకన జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ముఖ్యంగా సినీ కార్యక్రమాలకు సంబంధించిన వేదికలకు పెద్ద పెద్ద సెలబ్రిటీలు హాజరవ్వటమేకాదు, ప్రజలు కూడా ఆసక్తిగా తిలకిస్తుంటారు. అందుకే మరింత జాగ్రత్తగా మసులుకోవాల్సిందేనంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telugu Anchor  Jhansi  Singer Yesudas  Amara Comments  

Other Articles