ఫ్యాన్స్ ని చితకబాదమని బౌన్సర్లకు చెప్పాడంట | Shah Rukh Khan loses his cool gets into brawl with fan

Shah rukh khan loses his cool gets into brawl with fan

Shah Rukh Khan loses his cool, SRK beat Fan, SRK in The Ring Movie, Shah Rukh Khan The Ring Movie, Shah Rukh Khan brawl with fan, SRK brawl with Fan, Shah Rukh Khan Amsterdam, Shah Rukh Khan The Ring Movie Shooting, SRKbrawlfan

Shah Rukh Khan loses his cool gets into brawl with fan in Amsterdam while the ring movie shooting.

వీడియో: ఫ్యాన్ పై చెయ్యి చేసుకున్న షారూఖ్

Posted: 09/20/2016 12:34 PM IST
Shah rukh khan loses his cool gets into brawl with fan

అభిమానం హద్దులు తీరితే ఎలాంటి విషాదాలు మిగులుతాయో ఇటీవల కొన్ని ఉదంతాలు నిరూపించాయి. అయినా కూడా హీరోలను నిజజీవిత హీరోలుగా భావించి ఆరాధించే వారు పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్నారే తప్ప అస్సలు తగ్గటం లేదు. వారి పిచ్చిప్రేమకు గుర్తింపు లభించకపోగా, ఛీత్కరాలు, చివాట్లు, అవమానాలు ఎదురవుతున్నాయి. తాజాగా బాలీవుడ్ బాద్ షా తన అభిమానిపైనే దాడి చేసిన ఘటన హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం బాద్ షా ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో ది రింగ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆమ్ స్టర్ డామ్ లో జరుగుతోంది. తాజాగా అవుట్ డోర్ షూటింగ్ జరుగుతుండగా, షారూఖ్ ని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఇంతలో ఓ అభిమాని వచ్చి షారూఖ్ మెడ మీద చేయ్యేసి దగ్గరికి లాక్కోబోయాడు. వెంటనే స్పందించిన షారూఖ్ అతన్ని నిర్దాక్షిణ్యంగా వెనక్కి నెట్టివేశాడు. ఆపై అప్రమత్తమైన షారూఖ్ వ్యక్తిగత సిబ్బంది అతన్ని దూరం పంపించేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చింది. అయితే అది జరిగిన కొన్ని సెకన్లనే అక్కడే ఉన్న మరికొందరు అభిమానులతో సెల్ఫీలు తీసుకోవటం గమనార్హం.

అన్నట్లు షారూఖ్ తన భద్రత సిబ్బందికి నిర్దేశకాలు కూడా జారీ చేశాడంట. 25 ఏళ్ల లోపు అభిమానులను దూరంగా ఉంచాలని వారికి సూచించాడంట. ఎందుకంటే ఆ వయసులో అభిమానంతో మూర్ఖంగా ప్రవర్తిస్తారని స్వయంగా బాద్ షా చెబుతున్నాడు. వీరాభిమానంపై ఫ్యాన్ సినిమా తీసిన షారూఖ్ నుంచే ఇలాంటి స్పందన రావటం కాస్త విడ్డూరమే కదా? ప్రస్తుతం ఈ ఫ్యాన్ పై హీరో అటాక్ వీడియో మీడియాలో వైరల్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shah Rukh Khan  Amsterdam  The Ring Movie  Brawl Fan  

Other Articles