రీమేక్ తీసి గొప్పలు చెప్పుకుంటున్నాడే | prakash raj mana oori ramayanam shutter remake

Prakash raj mana oori ramayanam shutter remake

prakash raj mana oori ramayanam remake, prakash raj mana oori ramayanam trailer, prakash raj mana oori ramayanam Shutter Remake, prakash raj mana oori ramayanam, mana oori ramayanam satyaraj movie, mana oori ramayanam Malayalam remake, mana oori ramayanam tamil remake

prakash raj mana oori ramayanam shutter remake.

వార్నీ ప్రకాశ్ రాజ్ తీసింది ఆ రీమేకా!

Posted: 09/17/2016 12:27 PM IST
Prakash raj mana oori ramayanam shutter remake

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కన్నడలో, తెలుగులో ఏకకాలంలో సొంత డైరక్షన్ లో నటిస్తూ తీస్తున్న సినిమా మన వూరి రామాయణం. ప్రకాశ్ రాజ్ సొంత చిత్రాల్లో కాస్త మ్యాటర్ ఉందని ఫీలయ్యే జనాలకు రెండు టీజర్ లతో ఇందులో ఏదో కంటెంట్ ఉందనే హింట్ ఇచ్చాడు. ప్రియమణి వ్యాంప్ తరహా పాత్ర చేస్తుండటం, ప్రకాశ్ రాజ్ పాత్ర కూడా కాస్త వైవిధ్యంగా ఉండటం, సొంతగా సినిమాలో ఏదో చేశాడనే అంచనాలు పెంచాయి. తీరా శుక్రవారం సాయంత్రం జరిగిన ఆడియో పంక్షన్ లో ట్రైలర్ విడుదల చేసిన టీం అందులో అసలు మ్యాటర్ చెప్పేసింది.

ట్రైలర్ విషయానికొస్తే... భుజంగయ్య(ప్రకాశ్ రాజ్) అనే వ్యక్తి ఓ విదేశాలకు వెళ్లి బాగా డబ్బు సంపాదిస్తాడు. ఆపై సొంత వూరికి వచ్చిన అతను ఉత్సవాలను గ్రాండ్ గా జరిపించాలని ఫ్లాన్ చేస్తాడు. ఈ క్రమంలో ఓ వేశ్య(ప్రియమణి) తో తన ఇంట్లో బయట ఉండే ఓ గదిలో ఇరుక్కుపోతాడు. ఇదంతా చూస్తే ఒక్క విషయం మాత్రం అర్థమైంది. ఇది ప్రకాశ్ రాజ్ సొంత సినిమా కానే కాదు. అల్రెడీ మళయాళంలో హిటయ్యిన షట్టర్ అనే సినిమాకు రీమేక్. అంతేకాదు ఇదే సినిమాను ఏడాది క్రితం కటప్ప సత్యరాజ్ లీడ్ రోల్ లో ఒరునాల్ ఇరవిల్ అనే టైటిల్ తో రీమేక్ చేశారు.



ఓ వ్యక్తి, ఓ ఆటో డ్రైవర్, ఓ వేశ్య ఇలా సేమ్ కథనమే వాటిల్లో ఉంటుంది. కాకపోతే దాన్నే కాస్త కామెడీ టచ్ తో కన్నడ, తెలుగు కల్చర్ కి అనుగుణంగా మార్చి తీశాడని అనిపిస్తోంది. ఏదేమైనా సొంత ప్రాజెక్టు, ట్విస్టులు అంటూ హడావుడి చేసిన ప్రకాశ్ రాజ్ చివరకు ఓ రీమేక్ తో జనాలను దసరాకి పలకరించబోతున్నాడని క్లిస్టర్ క్లియర్ గా తెలిసిపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prakash Raj  Mana Oori Ramayanam  Shutter Remake  

Other Articles