మహేష్ బాబు, ప్రకాశ్ రాజ్ రూట్లో సోనూ సూద్ | Sonu Sood adopted Bahona village in Punjab

Sonu sood adopted bahona village in punjab

Sonu Sood adopted Bahona village, Sonu Sood Adopt, Sonu Sood adopts, Villan Adopts Became hero, Reel Villan become Real Hero

Sonu Sood adopted Bahona village in Punjab.

బాలీవుడ్ విలన్ కూడా హీరో అయిపోయాడు

Posted: 09/17/2016 11:36 AM IST
Sonu sood adopted bahona village in punjab

బాలీవుడ్ చిత్రాల కంటే సౌత్ లో, ముఖ్యంగా తెలుగులో చేసిన చిత్రాల ద్వారానే నటుడు సోనూ సూద్ కి మంచి గుర్తింపు లభించింది. అందుకే తెలుగును తన మాతృభాష తర్వాత అని, హైదరాబాద్ ను రెండో ఇంటిగా చెప్పుకుంటుంటాడు. అయితే ఈ మధ్య తెలుగులో మనోడి హవా తగ్గిపోయిందనే చెప్పాలి. దీంతో చివరకు మళ్లీ బాలీవుడ్ వైపే అడుగులు వేస్తున్నాడు.

ప్రస్తుతం ప్రభుదేవా, తమన్నా లీడ్ రోల్స్ పోషిస్తున్న అభినేత్రి (తమిళ్ లో దేవి) లో ఓ కీలకపాత్ర పోషించడమే కాదు. హిందీ వర్షన్ కి టుక్ టుక్ టూటియాకు మనోడే నిర్మాతగా వ్యవహారిస్తున్నాడు. ఇదిలా ఉండగా తన సొంత రాష్ట్రం పంజాబ్ లో ఓ గ్రామానికి దత్తత తీసుకుని బాలీవుడ్ హీరోల కంటే బెటర్ అని నిరూపించుకున్నాడు.

ప్రధాని నరేంద్ర మోదీ సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజనలో భాగంగా ఎంపీలతోపాటు పలువురు సెలబ్రిటీలు ఊళ్లు దత్తత తీసుకుంటున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, విష్ణు, చిన్న హీరో ఆదిత్య ఓం,  ఇంకోపక్క ప్రకాశ్ రాజ్, కోలీవుడ్ నుంచి సూర్య ఇలా ఊళ్లను దత్తత తీసుకుని బాగు చేసేస్తున్నారు. అయితే బాలీవుడ్ లో ఇంతవరకు ఏ స్టార్ హీరో కూడా ఈ విషయంలో స్పందించకపోయినా సోనూ రెస్పాన్స్ అవ్వటం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonu Sood  Punjab  Bahona Village  Adopts  

Other Articles