సూపర్ స్టార్ డాటర్ విడాకులు కన్ఫర్మ్ | Soundarya Rajinikanth confirms she and Ashwin are headed for a divorce

Soundarya rajinikanth confirms she and ashwin are headed for a divorce

Soundarya Rajinikanth Divorce, Soundarya Rajinikanth Twitter, Soundarya Rajinikanth Husband, Soundarya Rajinikanth confirms Divorce, Superstar Daughter Divorce, Reason behind rajani's daughter divorce

Soundarya Rajinikanth confirms she and Ashwin are headed for a divorce.

రజనీ కూతురు షాకిచ్చింది

Posted: 09/17/2016 11:28 AM IST
Soundarya rajinikanth confirms she and ashwin are headed for a divorce

సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు సెలబ్రిటీల సీరియల్ గా విడాకులు తీసేసుకుంటున్నారు. మొన్న అమలాపాల్, నిన్న సీనియర్ నటి లిజి, దర్శకుడు ప్రియదర్శన్ దంపతులు వేరుకాగా, తాజాగా ఏకంగా సూపర్ స్టార్ కూతురు విడాకులకు సిద్ధమైపోతుంది. రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్ తన భర్త అశ్విన్ నుంచి విడాకులు తీసుకోవాలనుకుంటుందుని నిన్నటి నుంచి వార్తల్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. దీంతో ఆమె నేరుగా స్పందించారు.

అవును నా విడాకుల విషయం నిజమేనంటూ ఏకంగా ట్విట్టర్ లో ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసేసింది. ఏడాది కాలంగా తాను, తన భర్త అశ్విన్ విడివిడిగా ఉంటున్నామని, తమ మధ్య విడాకుల విషయమై చర్చ కూడా నడుస్తుందని ఆమె తెలిపింది. అయితే విడాకులకు సరైన కారణం వివరించని ఆమె ఇది తమ కుటుంబ వ్యవహారమని, దీనిపై మీడియా ఊహగాన కథనాలు, జోక్యం అవసరం లేదని చెప్పుకోచ్చింది.

కాగా, రజనీకాంత్ కు ఇద్దరు కుమార్తెలు కాగా, ఐశ్వర్య హీరో ధనుష్ ని పెళ్లి చేసుకోగా, మరో కూతురు సౌందర్యరజనీకాంత్‌కు 2010లో వ్యాపారవేత్త అశ్విన్ రామ్‌కుమార్‌తో వివాహం జరిగింది. వారికి ఇటీవలే ఇక బిడ్డ కూడా కలిగాడు. మనస్పర్థల కారణంగానే ఆమె ఏడాదిగా భర్తకు దూరంగా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం కిడ్నీ సంబంధిత వ్యాధికి ట్రీట్ మెంట్ కోసం యూఎస్ వెళ్లిన అశ్విన్ తిరిగి రాగానే విడాకుల వ్యవహారం ఓ కొలిక్కివచ్చే అవకాశం ఉంది.

ఇక గ్రాఫిక్స్ టెక్నాలజిలో నిపుణురాలైన సౌందర్య గోవా చిత్రం ద్వారా నిర్మాతగానూ, తన తండ్రి హీరోగా నటించిన యానిమేషన్ చిత్రం కోచ్చడైయాన్ చిత్రంతో దర్శకురాలుగా చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యింది. తాజాగా ధనుష్ హీరోగా సౌందర్య ఒక చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Superstar  Rajanikanth  Divorce  Confirms  Divorce  Twitter  

Other Articles