చిరు కోసం చెర్రీ చేసే త్యాగం తెలుసా? | ram charan Dhruva release on Christmas

Ram charan dhruva release on christmas

Cheery Dhruva in Christmas, Ram Charan Dhruva shifts to Christmas, Dhruva release risk, Un season for Ram Charan Dhruva, Dhruva Risk for Khaidi, Cherry sacrifies for Chiru

Ram Charan Dhruva release on Christmas.

అన్ సీజన్ లోనే చెర్రీ సినిమా ఎందుకు?

Posted: 09/14/2016 04:35 PM IST
Ram charan dhruva release on christmas

యంగ్ హీరో అయి ఉండి ఎడతెరపని షూటింగ్ లో పాల్గొంటూ దానికి సమాంతరంగా మరో చిత్ర పనులు చూస్కోవడమంటే మాములు విషయం కాదు. కానీ, మెగా పవర్ స్టార్ రాంచరణ్ మాత్రం ఓవైపు తన సినిమా ధ్రువ షూటింగ్ లో పాల్గొంటూనే, నిర్మాతగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిరు 150వ చిత్రం పనులను చూసుకుంటున్నాడు. అరవింద స్వామి అనారోగ్యం రీత్యా ముందుగా అనుకున్న రిలీజ్ డేట్ దగ్గర పడటంతో వాయిదా వేసి మెగా అభిమానులకు నిరాశ కలిగించాడు.

షూటింగ్ చాలా ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ దసరాకు ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని బావించారు. కానీ, పరిస్థితుల ప్రభావంతో డిసెంబర్ కు మారుస్తూ నిర్ణయం తీసేసుకున్నారు. నిజానికి ధ్రువను పండగ సీజన్ లో రిలీజ్ చేసి సెలవు రోజులను క్యాష్ చేసుకోవాలని భావించాడు నిర్మాత అల్లు అరవింద్.. దసరాకి మిస్సయితే తర్వాత వచ్చే పెద్ద పండగ సంక్రాంతియే కాబట్టి అక్కడికి షిప్ట్ చేద్దామనుకున్నారంట. కానీ, చెర్రీ మాత్రం క్రిస్మస్ కి రిలీజ్ చేయాలని పట్టుబడుతున్నాడని తెలుస్తోంది.

సాధారణంగా క్రిస్మస్ సీజన్లో వచ్చిన తెలుగు చిత్రాలు హిట్టయిన దాఖలాలే లేవు. కానీ, చెర్రీ మాత్రం ఆ సెలవులనే టార్గెట్ చేసి డిసెంబర్ లో దించడానికి చూస్తున్నాడు. దీని వెనక కారణం సంక్రాంతికి చిరు 150వ  సినిమా రావటమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. తండ్రికి పోటీగా తన చిత్రం విడుదల చేయటం లేని చెర్రీ రిస్క్ అయినప్పటికీ అన్ సీజన్ లోనే రావాలని పట్టుబడుతున్నాడంట. ఈ లెక్కన తండ్రి కోసమే చెర్రీ త్యాగం చేస్తున్నాడని అంతా భావించారు. కానీ, ఖైదీ నంబర్ 150 నిర్మాత చెర్రీ, ధ్రువ కన్నా చిరు సినిమా బడ్జెట్ ఎక్కువ, పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఎక్కువగానే జరిగింది. దీంతో సొంత సినిమాకు ఎర్త్ పెట్టడం ఎందుకన్న ఉద్దేశంతో మెగా తనయుడు ఈ నిర్ణయం తీసుకున్నాడని అర్థమౌతోంది. ఈ లెక్కన చూస్కుంటే చెర్రీ చేసేదానిని త్యాగం కాకుండా ఏమంటారో మీరే డిసైడ్ చెయ్యండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Dhruva  Christmas  release  

Other Articles