ఫోటోషూట్ తో మతిపోగొట్టిన తెలుగు యాంకర్ | sreemukhi black and white stunning photo shoot

Sreemukhi black and white stunning photo shoot

Telugu anchor sreemukhi, sreemukhi hot photoshoot, sreemukhi stuns you with this black and photoshoot, sreemukhi black and white photo shoot, sreemukhi with shirt, sreemukhi latest photo shoot

Telugu Anchor sreemukhi stuns you with black and white photo shoot.

తెలుగు యాంకర్ ఫోటోషూట్ తో మతిపోవాల్సిందే

Posted: 09/14/2016 04:13 PM IST
Sreemukhi black and white stunning photo shoot

తెలుగు బుల్లితెరపై  యాంకర్ల శకం దశలు దశలుగా కొనసాగుతుంది. ఉదయభాను, ఝాన్సీ, అనితా చౌదరి, సుమ, శిల్పా చక్రవర్తిలాంటి వాళ్లు ఏళితే, ఆ తర్వాత అనసూయ, రష్మీ లాంటి వాళ్లు కాస్త హాట్ డోస్ ను పెంచేసి మురిపిస్తున్నారు. వీళ్లంతా ఏళ్లకు ఏళ్లు కష్టపడితేకానీ ఇప్పుడున్న పొజిషన్ కు చేరుకుకోలేకపోయారు. కానీ ఇప్పుడున్న తెలుగు యాంకర్స్ లో షార్ట్ టైంలో పేరు తెచ్చుకుంటుంది మాత్రం ఒక్క శ్రీముఖి అని చెప్పుకోవాలి.

ఓవైపు సినిమాలు, ఇంకోవైపు టీ షోలు, అదే చేత్తో మూవీ ఈవెంట్స్ ను ఒంటిచేత్తో నడిపిస్తోందీ వాలుకళ్ల సుందరి. ప్రస్తుతం యాంకరింగ్ లోకంలో దూసుకుపోతున్న స‌రికొత్త రాకెట్‌. క‌ళ్లుతిప్పుకోలేని గ్లామ‌ర్‌, గ‌ల‌గ‌ల మాట‌లు, చ‌క్కని స‌మ‌య‌స్ఫూర్తి, అంత‌కుమించి తెలివితేట‌లు ఇక యాంకర్ కి అంతకన్నా లక్షణాలు ఏం కావాలి? యాంక‌రింగ్ పీల్డ్ లో త‌క్కువ టైమ్‌లోనే తన‌తైన ముద్ర వేసింది శ్రీముఖి అంతే స్పీడ్ గా సినిమాలు చేసుకుంటూ పోతుంది.

ఇక టీవీషోలతో మన ఇంటి అమ్మాయిగా కనిపించే శ్రీముఖిలో హాట్ నెస్ యాంగిల్ కూడా చాలానే ఉందని చెప్పుకోవచ్చు. రీసెంట్ గా ఆమె చేసిన ఓ బ్లాక్ అండ్ వైట్ ఫోటో షూట్ చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. వైట్ షర్ట్ వేసుకుని పై బటన్స్ విప్పేసి రకరకాల యాంగిల్స్ లో ఈ ముద్దుగుమ్మ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ లు చూస్తే చూపుతిప్పుకోవాలని అనిపిస్తుందా చెప్పండి. మన దర్శకులు కరెక్ట్ కాంసంట్రేషన్ చేయట్లేదు గానీ, చేసుంటే సైడ్ క్యారెక్టర్లు ఏంటీ... ఏకంగా హీరోయిన్ క్యారెక్టర్లే ఇచ్చేయరంటారా చెప్పండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telugu anchor  Sreemukhi  latest photo shoot  

Other Articles