అతని డైరక్షన్లో వద్దంటూ ఎన్టీఆర్ కి విజ్నప్తులు | NTR next with Anil Ravipudi direction

Ntr next with anil ravipudi direction

NTR Anil Ravipudi, Anil Ravipudi with NTR, NTR next movie, NTR next after Janatha Garage, Fans request to NTR, NTR risk with that director

Fans request NTR not to do next film with Anil Ravipudi.

యంగ్ టైగర్ రిస్క్ గురించి అప్పుడే డిస్కషన్లు

Posted: 09/14/2016 06:13 PM IST
Ntr next with anil ravipudi direction

తారక్ కి ఈ రేంజ్ హిట్ పడటానికి పుష్కరంపైగానే పట్టింది. అందుకే జనతా గ్యారేజ్ విజయోత్సవ సంబరంలో అంతగా ఎమోషన్ అయ్యాడు. పేరులోనే జనత ఉండటంతో ఇంత రేంజ్ హిట్ అయ్యిందని మురిసిపోయాడు. కానీ, ఇక నుంచి చేయబోయే సినిమాలపై ఇంపాక్ట్ ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

గ్యారేజ్ విజయ విహారం ముగిసిన వెంటనే ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్టు ప్రారంభించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ 9నెలలు మొత్తం వేరే కథలు వినకుండా ఎన్టీఆర్ ఇందులోనే బిజీ అయిపోయాడు. దీంతో ఆలస్యం చేయకుండా మరోదాంట్లో బిజీ అయిపోవాలని చూస్తున్నాడు. అయితే ఈ క్రమంలో కథల ఎంపికలో కాస్త కన్ప్యూజ్ అవుతున్నట్లు వార్తలు అందుతున్నాయి. వక్కంతం వంశీ ప్రాజెక్టు సైడ్ అయిపోగా, లేటెస్ట్ గా పూరీ కూడా మూలపడిపోయిన రోగ్ చిత్రాన్ని మళ్లీ దులుపుతుండటంతో ఈ ఇద్దరు రేస్ నుంచి అవుట్ అయ్యారనే అనుకోవచ్చు. మిగిలిన వాళ్లలో తాజాగా అనిల్ రావిపూడి చెప్పిన కథపైనే ఎన్టీఆర్ కాస్త ఆసక్తి కనబరుస్తున్నాడని చెప్పుకుంటున్నారు.   

స్వతహాగా రైటర్ అయిన అనిల్ రావిపూడి కథలో స్పీడ్ తోపాటు, అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్  ఉన్న కథలు అందిస్తాడని పేరుంది. పటాస్, సుప్రీంలు హ్యూమరస్ చిత్రాలుగా పేరు దక్కించుకున్నప్పటికీ, కమర్షియల్ గా భారీ బ్లాక్ బస్టర్ లు కాలేకపోయాయి. ఈ దశలో జనతాగ్యారేజ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అనిల్ లాంటి చిన్న దర్శకుడితో పనిచేయటం మూలంగా ఎన్టీఆర్ రిస్క్ చేయడమే అవుతుందని అభిమానులు కలవరపడుతున్నారు. ఒకవేళ అది కార్యరూపం దాల్చినా కెరీర్ పరంగా అనిల్ కి తప్ప ఎన్టీఆర్ కి అది ఎందుకూ ఉపయోగపడదన్నది వారి వాదన. అందుకే టాప్ లీగ్ లో ఉన్న త్రివిక్రమ్ లాంటి దర్శకుడితో పని చేయాలని వారు సూచిస్తున్నారు.  చూద్దాం అభిమానుల మాటకా? లేక కథకా? ఎన్టీఆర్ దేనికి తలొగ్గుతాడో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Janatha Garage  Next movie  Anil Ravipudi  

Other Articles